‘నాగబంధం’ నుంచి ‘వీరనాగ’ సాంగ్ రిలీజ్
'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలను పెంచింది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ వీరనాగ సాంగ్ ని రిలీజ్ చేశారు. 'వీరనాగ' పాట నాగ సాధువుల ఆధ్యాత్మిక తాండవాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. శ్రీహర్ష ఈమని…
