Skip to content
హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ Telugu News

హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ

స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ సినిమా సాధించిన సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ జయాపజయాలకు అతీతంగా విజయ్ దేవరకొండ క్రేజ్ ఎవరూ కదిలించలేని, శంకించలేని స్థాయికి చేరుకున్నట్లు ఆయన లైనప్ చూస్తే తెలుస్తోంది. రౌడీ జనార్థన, రణబాలి, శౌర్యువ్, వైరా బ్యానర్ కొత్త సినిమా.. ఈ మూడు చిత్రాలు ఏమాత్రం మారని విజయ్ స్టార్ డమ్, రేంజ్ ను చూపిస్తున్నాయి. స్టార్ గా తను ఎదగడమే కాదు తన ఆకర్షణతో తెలుగు సినిమాను కూడా…

Read more
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ నియామకం Telugu News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ నియామకం

చైర్మన్ భరత్ భూషణ్ ను అభినందించిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ గా నియమింపబడ్డ భరత్ భూషణ్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారిని కలవగా ఆయన భరత భూషణ్ కు అభినందనలు తెలిపారు. అందరినీ కలుపుకుంటూ ఆంధ్ర ప్రదేశ్ లో సినీ, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని నందమూరి బాలకృష్ణ గారు సూచించారు సినిమాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వచ్చారు భరత్ భూషణ్. అలాగే భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా తనదైన శైలిలో…

Read more
వీడీ, డైరెక్టర్ శౌర్యువ్, వైరా క్రియేషన్స్ ప్రదీప్ ఉప్పలపాటి ప్రెస్టీజియస్ మూవీ నుంచి హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే పోస్టర్ రిలీజ్ Telugu News

వీడీ, డైరెక్టర్ శౌర్యువ్, వైరా క్రియేషన్స్ ప్రదీప్ ఉప్పలపాటి ప్రెస్టీజియస్ మూవీ నుంచి హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే పోస్టర్ రిలీజ్

హీరో విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా లైనప్ లో వైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాణంలో దర్శకుడు శౌర్యువ్ రూపొందిస్తున్న మూవీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైంది. టాప్ ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. 'ప్రపంచం వ్యతిరేకించినా, విధి అతన్ని రాజును చేసింది..' అంటూ బర్త్ డే పోస్టర్ పై రాసిన క్యాప్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చేతిలో ఖడ్గంతో సింహాసనంపై కూర్చుని ఉన్న విజయ్ స్టిల్ తో ఈ పోస్టర్…

Read more
తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రూ.4 లక్షల చెక్కును అందించిన హీరో కృష్ణసాయి Telugu News

తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రూ.4 లక్షల చెక్కును అందించిన హీరో కృష్ణసాయి

▪️రెడ్ క్రాస్ సొసైటీకి మద్దతుగా విరాళం ▪️ అభినందించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా హైదరాబాద్: టాలీవుడ్ హీరో కృష్ణసాయి తన సేవా కార్యక్రమాలతో మరోసారి ప్రశంసలు అందుకున్నారు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలకు మద్దతుగా తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రూ.4 లక్షల చెక్కును విరాళంగా అందించారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో యువతకు ఆదర్శంగా నిలుస్తూ సేవాభావంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కృష్ణసాయిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లు అంశాల‌పై వీరిద్ద‌రు చ‌ర్చించుకున్నారు. కృష్ణసాయి తన ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు…

Read more
ఘనంగా జరిగిన వా టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌ Telugu News

ఘనంగా జరిగిన వా టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

శుక్రవారం హైదరాబాద్‌ సిటాడెల్‌ హోటల్‌లో ఘనంగా జరిగిన వా ది ఓజీస్‌ టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ సినీ, వ్యాపారవేత్తల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ సంగీత దర్శకులు కోటి, చేతన్‌ భరధ్వాజ్, సినిమా దర్శకుడు జ్ఞానశేఖర్‌లతో పాటు సింగర్స్‌ శ్రీకృష్ణ, సెలబ్రిటీ లైఫ్‌ స్టైల్‌ గురు నటుడు మోటివేషనల్‌ స్పీకర్‌ ప్రదీప్‌ కొండిపర్తి మార్గ దర్శకత్వం మరియు మెంటార్‌షిప్‌లో జరిగింది. ఈ మహాసంగీత వినోద వేడుక తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ చరిత్రలో ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలకు కొత్త ప్రమాణాలను సృష్టించబోతుంది. కర్టెన్‌రైజర్‌ తర్వాత సంగీత దిగ్గజం కోటి మాట్లాడుతూ–‘‘ ఇలాంటి సంగీతానికి సంబంధించిన కాంటెస్ట్‌ను గతంలో నేను ఎప్పుడు వినలేదు. ఎంతో క్రియేటివిటీతో కూడిన ఈ ఈవెంట్‌కి…

Read more
రాయవలస టీజర్ చాలా కనెక్టింగ్ గా ఉంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో – హీరో ఆకాశ్ జగన్నాథ్ Telugu News

రాయవలస టీజర్ చాలా కనెక్టింగ్ గా ఉంది. ఈవెంట్ లో హీరో ఆకాశ్ జగన్నాథ్

రాయవలస మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. కంటెంట్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి: హీరో కార్తీక్ జయంతి కార్తిక్ జయంతి ని హీరోగా పరిచయం చేస్తూ RaysuN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “రాయవలస”. ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మించగా మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. “Love Tied by Fate” అనే ట్యాగ్‌లైన్ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ఈ వేడుకకు హాజరయ్యారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ…

Read more
రావు బహదూర్’ జూలై 3న వరల్డ్ వైడ్ రిలీజ్ Telugu News

రావు బహదూర్’ జూలై 3న వరల్డ్ వైడ్ రిలీజ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్' చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, అలాగే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘ఓ సుందరి’ పాట సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. వింటేజ్ వాతావరణాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేసిన ఆ పాటలోని మెలోడీ, విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా…

Read more
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో స్పోర్ట్స్ ఇంజరీస్ కోసం అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్ Telugu News

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో స్పోర్ట్స్ ఇంజరీస్ కోసం అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్

క్రీడా గాయాలు, ఆర్థోపెడిక్‌ సమస్యలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని అపోలో హాస్పిటల్లో “అపోలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ ఇంజరీస్‌ అండ్‌ ఆర్థోపెడిక్స్‌”ను ప్రారంభించారు. క్రీడాకారులు, ఫిట్‌నెస్‌ అభిరుచి కలిగిన వారికి ఒకేచోట నిర్ధారణ, శస్త్రచికిత్స, పునరావాస సేవలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభ కార్యక్రమంలో కేఈఐ గ్రూప్‌ వ్యవస్థాపకుడు శ్రీ అనిల్ కామినేని, తెలంగాణ ప్రభుత్వ క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేష్ రన్ జన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కేంద్రాన్ని సందర్శించారు. ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్ కమిన్స్ తో పాటు ప్రఫుల్‌ హింగే, సాకిబ్‌ హుస్సేన్‌కు వైద్యసదుపాయాలను వివరించారు. ఆధునిక చికిత్స, పునరావాస సౌకర్యాలు క్రీడాకారుల…

Read more
కేవలం 4 గంటల్లోనే $100K ప్రీ-సేల్స్ తో నార్త్ అమెరికాలో ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ చరణ్ ‘పెద్ది’ Telugu News

కేవలం 4 గంటల్లోనే $100K ప్రీ-సేల్స్ తో నార్త్ అమెరికాలో ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ చరణ్ ‘పెద్ది’

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలోకి రాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తుఫాన్‌లా దూసుకెళ్తున్నాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం నాలుగు గంటల్లోనే సినిమా 100K డాలర్ల మార్క్‌ను దాటేసి ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ట్రైలర్ కూడా విడుదల కాకముందే ఈ స్థాయి ఓపెనింగ్ రావడం సెన్సేషనల్ గా మారింది. రామ్ చరణ్ స్టార్ పవర్‌పై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం, బుచ్చిబాబు స్టొరీ టెల్లింగ్ ప్రత్యేకత కలిసివచ్చి ఈ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. నార్త్ అమెరికా రిలీజ్ ప్రత్యంగిరా సినిమాస్ నిర్వహిస్తోంది. వారి రిలీజ్…

Read more
ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా Telugu News

ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్నిసొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమయ్యింది. "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఆహా గోల్డ్ యూజర్స్…

Read more