‘వసుదేవసుతం’ కంటెంట్ అందరికీ నచ్చుతుంది – మాస్టర్ మహేంద్రన్
రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించారు. ఇప్పటి వరకు మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆలయంలోని బ్రహ్మ పదార్థం కోసం శత్రు మూకలు చేసే విన్యాసాన్ని అడ్డుకునే పాత్రలో హీరో మహేంద్రన్ అదరగొట్టేశారు. యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ‘ఆయుధం వస్తోంది’.. ‘దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే…
