ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.37.4 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్‌తో బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటిన ‘కొరియన్ కనకరాజు’
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను చూపించారు. హారర్ కామెడీగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటుకుని ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టింది. మేకర్స్ మొదటి నుంచే పెట్టుకున్న నమ్మకానికి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ మరింత బలాన్ని ఇస్తోంది. సినిమాకు సంబంధించిన పాజిటివ్ బజ్ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే కనిపించాయి. అది ఇప్పుడు అద్భుతంగా వర్కౌట్ అయింది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ సినిమాకు బిగ్ ప్రమోషన్‌గా మారింది. రోజురోజుకూ ‘కొరియన్ కనకరాజు’కి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌కు చేరువలో ఉంది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌లో…
