మేక్ ఏ విష్ ఇండియా ద్వారా చిన్నారి శ్రద్ధాను ప్రత్యేకంగా కలిసి ఆమెతో మాట్లాడిన అల్లు అర్జున్
ప్రపంచ వ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న అభిమాన గణం గురించి తెలిసిందే. ఆయన తన వినయంతో అభిమానులపై చూపించే ప్రేమతో అందరి ప్రేమను గెలుచుకున్నారు. తన అభిమానుల్లో పిల్లలపై ఆయన ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించారు. సిల్వర్ స్క్రీన్‌పై అందరినీ మెప్పించే ఈ స్టార్ హీరో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు కూడా ఆయన మద్ధతునిచ్చి అందరికీ ఆనంద క్షణాలను పంచుతుంటారు. అలాంటి చిన్నారి అభిమానుల్లో చిన్నారి శ్రద్ధ కూడా ఒకటి. ఆమెకు ఎప్పటి నుంచో తన అభిమాన హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలనే కోరిక. ఆమె కోరికను తెలుసుకున్న మేక్ ఏ విష్ ఇండియా చేసిన ప్రయత్నాలు.. అల్లు అర్జున్ చూపించిన ఆత్మీయ సహకారంతో ఆ చిన్నారి…
