‘రాకాస’ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది – నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’తో రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిహారిక ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. ప్రస్తుతం నిహారిక జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ సందర్భంగా శుక్రవారం నాడు ‘పదే పదే’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను సెయింట్ పీటర్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో.. ‘Padhe Padhe’…
