Skip to content

‘ఇరుముడి’ నుంచి బ్యూటీఫుల్ హోమ్లీ సాంగ్ ‘యాలాలో యాలాలో’ రిలీజ్

మాస్ మహారాజా మోస్ట్ ఎవైటెడ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’ ప్రమోషన్స్ తో ఉత్సాహాన్ని పెంచుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, తన భక్తి గీతమైన మొదటి పాట ‘ఇరుముడి కట్టు’తో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే జోరును కొనసాగిస్తూ, కుటుంబ బంధాలలోని ఆప్యాయతను అందంగా చాటిచెప్పే రెండవ పాట ‘యాలాలో యాలాలో’ను చిత్ర బృందం విడుదల చేసింది.

జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు ఆయన అందించిన సాఫ్ట్ మెలోడీ, ఆర్కెస్ట్రేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం మధ్యతరగతి కుటుంబంలోని ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలే అసలైన సంపద అనే భావాన్ని హృదయానికి హత్తుకునేలా చెబుతుంది. హెషామ్ అబ్దుల్ వహాబ్, సాధికా కెఆర్ ఆలపించిన తీరు పాటకు మరింత భావోద్వేగాన్ని జోడించింది.

ఈ పాట ద్వారా సినిమా ఎమోషనల్ కోర్‌ను కూడా మేకర్స్ చూపించారు. రవితేజ కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించే ఓ ఆటో డ్రైవర్‌గా కనిపిస్తారు. మద్యానికి బానిసైనప్పటికీ కుటుంబం కోసం తపించే తండ్రి పాత్రలో ఆయన సహజమైన నటన ఆకట్టుకుంటోంది. ప్రియ భవాని శంకర్ కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకునే భార్య పాత్రలో మెప్పించగా, బేబీ నక్షత్ర తండ్రితో విడదీయలేని అనుబంధం ఉన్న కూతురిగా మనసుని తాకింది. పాటలోని ప్రతి విజువల్, ప్రతి ఎమోషన్ సాహిత్యానికి అద్భుతంగా తోడై కుటుంబ బంధాలను ఎంతో సహజంగా చూపించింది. ఈ పాట విడుదలైన వెంటనే ప్రేక్షకులకి ఫేవరేట్ గా మారింది

ఇప్పటివరకు మాస్, యాక్షన్ పాత్రలతో అలరించిన రవితేజ… ఈసారి పూర్తిగా భిన్నమైన భావోద్వేగ పాత్రలో కనిపిస్తున్నారు. ప్రియ భవాని శంకర్, బేబీ నక్షత్ర కూడా తమ సహజమైన నటనతో పాటకు మరింత బలం చేకూర్చారు. ముఖ్యంగా ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా కోరియోగ్రఫీ చేయడం విశేషం. ఒకే పాటలో కుటుంబ ప్రేమ, బాధ, ఆప్యాయత, అనుబంధాలను ఎంతో అందంగా ఆవిష్కరించిన ఆయన వర్క్ ప్రత్యేక ప్రశంసలు అందుకునేలా ఉంది.

నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల మనసులను తాకుతున్న ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: విష్ణు శర్మ
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి
కో-డైరెక్టర్: సురేష్
మేకప్: శ్రీనివాస్ రాజు
కాస్ట్యూమర్ డిజైనర్: రాజేష్
పోస్టర్ డిజైనర్: ఎల్లో టూత్స్
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.