సందీప్ కిషన్ ‘పవర్‌పేట’ పవర్‌ఫుల్ గ్లింప్స్ రిలీజ్
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని ప్రముఖ బ్యానర్ 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతుంది. బలమైన కథనంతో కూడిన సినిమాలకు మద్దతు ఇవ్వడంలో పేరుపొందిన ఈ నిర్మాణ సంస్థ తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రచయిత నుంచి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పుట్టినరోజు సందర్భంగా, పవర్‌పేట చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో హంగామాతో హై వోల్టేజ్ మూడ్‌లో ప్రారంభమవుతుంది. అభిమానుల అరుపులు, సంబరాల మధ్య హీరో ఎంట్రీ, సిగరెట్ తాగుతూ సింహం గురించి పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పడం అలరించింది ఆ తర్వాత…
