‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ – జూన్ 29న రిలీజ్
మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' చిత్రంతో విభిన్నమైన ఎమోషనల్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, ఇప్పటికే విడుదలైన 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' వీడియోతో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఆ వీడియో ఎమోషన్ ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఇందులో రవితేజ అంకితభావం గల తండ్రిగా కనిపించారు, తండ్రి కూతురు అనుబంధమే కథకు ప్రధాన బలంగా నిలవనుంది. ఇప్పుడు షూటింగ్ మొత్తం పూర్తయిన నేపథ్యంలో చిత్ర బృందం మ్యూజిక్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా, జూన్ 29న 'ఇరుముడి కట్టు' తొలి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయ్యప్ప మాల ధరించిన రవితేజ, రాబోయే యాత్రా సీజన్‌కు…
