Skip to content

‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ – జూన్ 29న రిలీజ్

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ చిత్రంతో విభిన్నమైన ఎమోషనల్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, ఇప్పటికే విడుదలైన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ వీడియోతో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఆ వీడియో ఎమోషన్ ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఇందులో రవితేజ అంకితభావం గల తండ్రిగా కనిపించారు, తండ్రి కూతురు అనుబంధమే కథకు ప్రధాన బలంగా నిలవనుంది.

ఇప్పుడు షూటింగ్ మొత్తం పూర్తయిన నేపథ్యంలో చిత్ర బృందం మ్యూజిక్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా, జూన్ 29న ‘ఇరుముడి కట్టు’ తొలి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయ్యప్ప మాల ధరించిన రవితేజ, రాబోయే యాత్రా సీజన్‌కు అనుగుణంగా ఈ పాట విడుదల కానుండటంతో, ఇది ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే కాకుండా చిత్ర సంగీతానికి సరైన ఆరంభంగా నిలవనుంది.

ఈ పాట పోస్టర్‌లో ఆలయం వైపు చేయి ఎత్తి చూపిస్తూ, భారీ సంఖ్యలో భక్తుల మధ్య రవితేజ కనిపించారు. భక్తిభావం ఉట్టిపడే సన్నివేశాలు… ఈ పాట విజువల్ గా, ఎమోషనల్ గా హృదయానికి హత్తుకునేలానూ ఉండబోతోందని సూచిస్తున్నాయి.

ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ నటిస్తుండగా, కథకు కీలకంగా నిలిచే పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తోంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వసిక ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మాణ సారథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. విష్ణు శర్మ ఛాయాగ్రహణం, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: విష్ణు శర్మ
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి
కో-డైరెక్టర్: సురేష్
మేకప్: శ్రీనివాస్ రాజు
కాస్ట్యూమర్ డిజైనర్: రాజేష్
పోస్టర్ డిజైనర్: ఎల్లో టూత్స్
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.