డెలివరీ బాయ్ తో గొడవ వివాదంపై వివరణ ఇచ్చిన యువ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి
రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి ఓ డెలివరీ బాయ్ మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చారు హీరో అఖిల్ రాజ్. తప్పుడు అడ్రస్ కు ఫుడ్ డెలివరీ చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులు, తల్లిని దూషించినందుకే అతన్ని తాను మందలించానని అఖిల్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను అఖిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అఖిల్ రాజ్ స్పందిస్తూ - ఆ రోజు మా ఇంట్లో ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. అయినా ఫుడ్ పార్శిల్ వచ్చింది. మా అమ్మ ఆ పార్శిల్ తీసుకుని, ఎవరు ఆర్డర్…
