ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల ‘కుబేర’ నుంచి సెకండ్ సింగిల్ అనగనగ కథ రిలీజ్
ధనుష్-నాగార్జున హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా 'కుబేర' టీం దూకుడుగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ అనగనగ కథ సినిమా పవర్ ఫుల్ మోరల్ కోర్ కి పర్ఫెక్ట్ మ్యూజిక్ ప్రజెంటేషన్ ని అందిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలని పెంచుతూ కొత్త సాంగ్ సినిమా సారాంశాన్ని తెలియజేస్తోంది. ఇది దురాశ, అవినీతి మధ్యలో చిక్కుకున్న దుర్బలమైన మానవత్వం ఇతివృత్తాలతో డీప్ గా కనెక్ట్ అయ్యే సాంగ్. చార్ట్‌బస్టర్ మాస్ నంబర్‌లకు పేరుగాంచిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ అనగనగ కథ ని మనసుని కదిలించే ట్రాక్ గా కంపోజ్ చేశారు. గేయ రచయిత చంద్రబోస్ ఆర్థిక అసమతుల్యత, డబ్బు అవినీతి ప్రభావం…
