మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా 'పెద్ది' తో బాక్సాఫీస్‌ను…
*75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోయిన జీ5 తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’

జీ5 తెలుగులో గత వారం వచ్చిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్ని పోషించారు. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
https://www.instagram.com/p/DVYkUGYAd4N
స్ట్రీమింగ్ అయిన 75 గంటల్లోనే ఈ సిరీస్‌కి 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దక్కాయి. అంటే ఈ సిరీస్‌ను ప్రేక్షకులు ఏ రేంజ్‌లో చూస్తున్నారో, ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇది డిటిటల్ ఫ్లాట్ ఫాంపై బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఉద్యోగం కోసం సిటీకి వచ్చిన అమ్మాయి కనిపించకపోవడం, కూతురు కనిపించకపోవడంతో తండ్రి పడే బాధ, మిస్టరీగా మారిన అమ్మాయి కేసుని చేదించే క్రమంలో పోలీసులకు ఎదురైన సవాళ్లు ఇలా అనేక లేయర్స్‌తో తీసిన ఈ వెబ్ సిరీస్ ఆడియెన్స్‌ని కట్టి పడేసింది.
ప్రస్తుత సమాజంలోని పరిస్థితులు, సిటీ లైఫ్, లేడీస్ హాస్టల్‌లో జరిగే ఘటనలు, అమ్మానాన్నల పెంపకం, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ గురించి ఇలా ఎన్నో విషయాల్ని ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ చెప్పే ప్రయత్నం చేసింది. సమాజానికి ఓ చక్కని సందేశం ఇచ్చేలా తీసిన ఈ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సిరీస్ మున్ముందు మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.
▶️ https://zee5.onelink.me/RlQq/s6ohpv62
ప్రసాద్ రావు పాత్రలో తండ్రిగా రాజీవ్ కనకాల, కూతురిగా స్వాతి పాత్రలో వాసంతిక అద్భుతంగా నటించారు. ఇక చాలా కాలం తరువాత ఉదయ భాను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రెబెకా పాత్రలో మెప్పించారు. ఇంకా చూడని వారు వెంటనే జీ5 తెలుగులో ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ని చూడండి.
ZEE5 గురించి…
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, లింక్డిన్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో జీ5ని అనుసరించండి.
తారాగణం : రాజీవ్ కనకాల, వాసంతిక, ఉదయ్ భాను, గాయత్రి భార్గవి, హిమ బిందు తదితరులు
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత పేరు – కె.వి.శ్రీరామ్
ప్రొడక్షన్ హౌస్ – సౌత్ ఇండియా స్క్రీన్స్
దర్శకుడు – కృష్ణ పోలూరు
స్క్రీన్ ప్లే – కృష్ణ పోలూరు
డైలాగ్ రైటర్ – మైదాల శృతి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – శ్రీ రామ్ మద్దూరి
ఎడిటర్ – చంద్రశేఖర్.జి.వి
సినిమాటోగ్రాఫర్ – రామ్ కె మహేష్
