సినిమా బాగుంటే ఆదరిస్తారని ‘డిసి’ మరోసారి నిరూపించింది : నిర్మాత సురేష్ బాబు
లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'డిసి'. లోకేష్ కనగరాజ్ హీరో గా పరిచయమైన ఈ చిత్రాన్ని అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్ గా నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 7న ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో గ్రాండ్ గా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్మించారు. ప్రెస్ మీట్ లో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.."అందరికీ నమస్కారం. 'డీసీ' సినిమాకు వస్తున్న రిపోర్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. సన్ పిక్చర్స్‌కు ధన్యవాదాలు. ఏషియన్ సునీల్ గారు, దిల్ రాజు గారు, మేమంతా కలిసి…
