Skip to content

తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘కొరియన్ కనకరాజు’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో అదరగొట్టారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.10.2 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ప్రీమియర్స్ కలుపుకుని వచ్చిన ఈ వసూళ్లతో వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కామెడీ, హారర్ అంశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అదే టాక్ తొలి రోజు థియేటర్లలో కనిపించింది. అర్బన్ సెంటర్లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ ఆక్యుపెన్సీ అద్భుతంగా వుంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న మౌత్ టాక్ సినిమాకు మరింత కలిసొస్తోంది…

Read more

‘ఇరుముడి’ ఆగస్టు 12న ట్రైలర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ మచ్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌తోనూ ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన 'గ్లింప్స్', పాటలతో ఆసక్తిని రేకెత్తించిన చిత్ర బృందం, ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 12న భీమవరంలో జరిగే భారీ కార్యక్రమంలో 'ఇరుముడి' ట్రైలర్ విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి రవితేజ స్వయంగా హాజరుకానుండటంతో, ఇది సినిమా ప్రచారంలో ఒక కీలక ఘట్టం కానుంది. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ రెండు విభిన్న అవతారాల్లో కనిపిస్తున్నారు. ఒకవైపు నోటిలో గొడ్డలితో మాస్ లుక్‌లో…

Read more

ఘనంగా ‘శివ గాడి జింద‌గీ’ మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జింద‌గీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వినయ్ రెడ్డి చందుపట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను నిర్మాత సురేష్‌బాబు లాంచ్ చేశారు. సాంగ్‌ను అతిథులుగా పాల్గొన్న‌ రీల్ఆన్ సీఈఓ దాశరథం బిట్ల, రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ ప్రిన్సిపల్ పూల సందీప్ కుమార్ నాయుడు, ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు శివ మ‌ల్లాల‌ విడుద‌ల చేశారు. చిత్ర యూనిట్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సగటు మనిషి జీవితానికి ప్రతిరూపం! కామెడీ, ఎమోషన్, డ్రామా, ఫ్రెండ్‌షిప్, లవ్ వంటి అన్ని రకాల వినోద అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఒక…

Read more

‘భారత్ భాగ్య విధాత’ ఆగష్టు 14న హిందీ జీ 5లో ప్రత్యేక ప్రసారం

* కంగనా రనౌత్, గిరిజా ఓక్, స్మిత తాంబే నటించిన 'భారత్ భాగ్య విధాత' త్యాగం, వీరత్వంకు ప్రతీకగా నిలిచే చిత్రం ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ధైర్యం, స్థైర్యం, నిస్వార్థ సేవలోని స్ఫూర్తిని చాటిచెప్పేందుకు ఆగస్టు 14న 'భారత్ భాగ్య విధాత' ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌తో హిందీ జీ 5 ప్రేక్షకులను ఆహ్వానిస్తోంది. భారతదేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు సాహసోపేతమైన, స్ఫూర్తిదాయకమైన, సాంస్కృతికంగా ప్రతిధ్వనించే కథలను అందించాలనే తన నిబద్ధతను కొనసాగిస్తూ ఈ స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దేశాన్ని నిర్వచించే విలువలను ప్రతిబింబించే అసాధారణ ధైర్యసాహసాలు కలిగిన అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకు వస్తుంది. మనోజ్ తపడియా రచన, దర్శకత్వంలో పెన్ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్, పరమహంస్ క్రియేషన్స్, యూనోయా ఫిల్మ్స్ LLP,…

Read more

“ది మేజ్” చిత్రంతో దర్శకుడిగా ప్రతిభ చాటనున్న డా. రవికిరణ్ గడలాయ్

డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్ డాక్టర్ గా తన వృత్తిలో కీర్తి ప్రతిష్టలు గడించి ఇప్పుడు దర్శకుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. శ్రీరామ్ (శ్రీకాంత్) హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ కథతో "ది మేజ్" చిత్రాన్ని తన తొలి ప్రయత్నంగా తెరకెక్కిస్తున్నారు. రవికిరణ్ గడలాయ్ గతంలో "ది రాంగ్ స్వైప్" అనే షార్ట్ ఫిలింను తన ఫోన్ తో తెరకెక్కించారు. ఈ లఘుచిత్రం రూపొందించే క్రమంలో కథ చెప్పే విధానం, కెమెరా, నటన, సన్నివేశ నిర్మాణం, ఎడిటింగ్ వంటి అంశాలపై అవగాహన తెచ్చుకున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా డైరెక్టర్ డా.రవికిరణ్ గడలాయ్ పాత్రికేయులతో ముచ్చటించారు. డా. రవికిరణ్ గడలాయ్ మాట్లాడుతూ -…

Read more

‘అగధ’ డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా చాలా అద్భుతంగా ఉంటుంది – హీరో శ్రవణ్ రెడ్డి

ఎంఎస్ రాజు గారు ‘అగధ’ సీక్వెల్ ఎప్పుడు అంటారో చూడాలి - హీరో శ్రవణ్ రెడ్డి శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో హీరో శ్రవణ్ రెడ్డి శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ‘డర్టీ…

Read more

పాతబస్తీ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో బంగారు బోనం ఎత్తిన సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య నిహారికకు ఆలయ చరిత్రతో పాటు ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల విశిష్టత, సంప్రదాయాలను వివరించారు. అనంతరం నిహారిక మాట్లాడుతూ, ప్రధాన బోనాల రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయానని, అందుకే అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి…

Read more

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమైన భరత్ భూషణ్

ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, అలాగే ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లోని కీలక సభ్యులతో ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ భరత్ భూషణ్ గారు, ఏపీ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారితో కలిసి కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందే దిశగా చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా APSFTVTDC చైర్మన్ భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ... "ఆంధ్రప్రదేశ్ లో సినీ రంగం అభివృద్ధి చెందే విధంగా, ముఖ్యంగా సినిమా షూటింగులు గురించి ప్రభుత్వ అధికారులు చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో సినిమాలకు సంబంధించిన షూటింగులు, వాటి పర్మిషన్లు త్వరగా అందేలా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో…

Read more

‘పళ్ళ బురుసు’ చిత్రం ట్రైలర్ విడుదల

అన్నపూర్ణ స్టూడియోస్, EPIC స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రం 'పళ్ళ బురుసు'. ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలు. ఉదయ్ చౌహాన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి, ప్రజ్వల్ యాద్మ, సుజాత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న సినిమా విడుదల కానుండగా, తాజాగా కింగ్ నాగార్జున అక్కినేని ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్‌ను డిజిటల్ విడుదలకు ముందే సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా కింగ్ అక్కినేని నాగార్జున లచ్చపేట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.…

Read more

కొరియన్ కనకరాజు’కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది : ప్రిన్స్ వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. "నిన్న సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. మొదటి నుంచి ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ మేము ఊహించిన దానికంటే…

Read more