Skip to content

“ఇంద్రపుత్ర” ఫస్ట్ ఛాప్టర్ అనౌన్స్ మెంట్

"క", "కె ర్యాంప్", "చెన్నై లవ్ స్టోరీ" సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. "క" చిత్రంతో థ్రిల్లర్, "కె ర్యాంప్" తో మాస్ ఎంటర్ టైనర్, "చెన్నైలవ్ స్టోరీ"తో ఎమోషనల్ లవ్ స్టోరీ చేసిన కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన జానర్స్ ను ఎంచుకుంటూ హీరోగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఈ క్రమంలో జాయ్ ఫిలింస్ లో ఓ సినిమా, "కెఎ 13" అనే మరో సినిమాతో పాటు సుకుమార్ రైటింగ్స్ లో "కెఎ 14" సినిమా చేస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు "కెఎ15" గా భారీ మైథాలజీ మూవీని ప్రకటించారు. జీ స్టూడియోస్, ప్రేరణ…

Read more

‘కిల్లర్’కు ఓవర్సీస్‌లో భారీ బజ్

OMG Pictures చేతికి అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ హక్కులు✅ జ్యోతి పూర్వజ్ #SuperSHE చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు సహా పలు దేశాల్లో విడుదల. హైదరాబాద్: వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’కు అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక ముందడుగు పడింది. పూర్వాజ్ రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను OMG Pictures సొంతం చేసుకుంది. ఉర్వీష్ పూర్వజ్ సమర్పణలో, THINK CINEMA బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘కిల్లర్’లో జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మహిళా ప్రధాన కథాంశంతో సైన్స్ ఫిక్షన్, మిస్టరీ, యాక్షన్, థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా అంశాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని…

Read more

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు ఆవిష్కరించిన ‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌!

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌, పాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్‌ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాత…

Read more

ఈ నెల 14న ‘పాంచాలి పంచభర్తృక’ మూవీ రిలీజ్

డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘పాంచాలి పంచభర్తృక’. ఈ చిత్రంలో సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ డ్రామాతో కూడిన కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు గంగ సప్తశిఖర. ఈ చిత్రాన్ని రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్‌, ఓం సాయిరాం ఆర్ట్స్‌ బ్యానర్స్ పై వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్‌ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం నిర్మించారు. ఈ నెల 14న ‘పాంచాలి పంచభర్తృక’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్…

Read more

‘కపాలి’ నుంచి హన్సిక మోత్వాని ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో రోహిత్ నారా ప్రస్తుతం పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ 'కపాలి' లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప నిర్మించగా, విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హన్సిక మోత్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. హన్సిక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంటెన్స్ లుక్‌లో హన్సిక కనిపిస్తున్న ఈ పోస్టర్.. 'కపాలి' కథలో ఆమె పాత్రకు ఉన్న…

Read more

“సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అందరి ప్రశంసలు అందుకున్న పరదా లాంటి విభిన్నమైన చిత్రం తర్వాత ఆనంద మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు పి.వి., విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ…

Read more

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ నుంచి రెండు స్పెషల్ స్టిల్స్‌ను విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వారణాసి’ చిత్రం నుండి రెండు ప్రత్యేక స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ స్టిల్స్‌తో రుద్ర తన నేచురల్ లుక్‌లో ప్రపంచానికి తొలిసారిగా కనిపించాడు. మొదటి స్టిల్‌లో దట్టమైన అడవి మధ్యలో ఒక వెదురు తెప్పపై విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా రుద్ర కనిపిస్తున్నాడు. ఇక ఆ స్టిల్‌ను చూస్తే పాలసంద్రంలో ఆదిశేషుపై సేదతీరే శ్రీ మహా విష్ణువులా కనిపిస్తున్నారు. ఇంకో స్టిల్‌లో కెన్యాలోని మసాయి మారా విశాలమైన మైదానాలకు చెందింది. అక్కడ రుద్ర జిరాఫీలు, వైల్డ్‌బీస్ట్‌ల మధ్య నిలబడి, వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఈ రెండు స్టిల్స్‌ను గమనిస్తే ‘వారణాసి’ సినిమాలోని సోల్, రుద్ర పాత్ర తీరు గురించి అందరికీ…

Read more

‘టాక్సిక్’ ఈ సినిమా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది: రాకింగ్ స్టార్ యశ్

రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' లవ్ రివెంజ్ యాక్షన్ మాగ్నమ్ ఓపస్‌ ట్రైలర్ లాంచ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ విడుదలైంది. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ట్రైలర్.. అధికారం, ప్రేమ, ద్రోహం, ప్రతీకారం చుట్టూ తిరిగే ఓ భారీ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని పరిచయం చేసింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు, అబ్బురపరిచే విజువల్స్, బలమైన క్యారెక్టర్లతో ‘టాక్సిక్’ ఒక భారీ యాక్షన్ మాగ్నమ్ ఓపస్‌గా కనిపిస్తోంది. ఈ కథలో రాయా, అతని కుమారుడు మధ్య ఉండే సంక్లిష్టమైన సంబంధం ప్రధాన భావోద్వేగంగా కనిపిస్తోంది. తండ్రి, కొడుకుల మధ్యే సంఘర్షణకు దారితీసే పరిస్థితులు ఆసక్తిని పెంచుతున్నాయి. మరోవైపు నయనతార, కియారా అద్వానీ,…

Read more

‘పళ్ళబురుసు’ నుంచి ‘హైలో హైలో హైలెస్సా’ సాంగ్ రిలీజ్

ఆకట్టుకునే ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన పళ్ళబురుసు' టీమ్, ఇప్పుడు ‘హైలో హైలో హైలెస్సా’ అనే ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాట సంప్రదాయ జానపద శైలికి మోడరన్ బీట్‌లను జోడిస్తూ ఆకట్టుకుంటోంది. పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాటకు సురేశ్ గంగుల సాహిత్యం అందించారు. శ్రీరామచంద్ర, లక్ష్మీ మేఘన తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. క్యాచీ బీట్స్, సంప్రదాయ సంగీత వాయిద్యాల ఫ్లేవర్, ఆకట్టుకునే విజువల్స్‌తో పాట ఆద్యంతం ఆకట్టుకుంది. ‘హైలో హైలో హైలెస్సా’ పాటలోని ఎనర్జీ, జానపద టచ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. చిత్రం ప్రమోషన్స్‌లో ఈ పాట మరో ఆకర్షణగా…

Read more

‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ ఆగస్ట్ 10న రిలీజ్

గత కొన్నేళ్లుగా విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్, ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్‌ 'రంభ ఊర్వశి మేనక'తో సిద్ధమయ్యారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ ను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "Comedy Goes Cosmic" అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ వినోదంతో మేళవించిన వినూత్న కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి పాట 'నా కంటి మీద కునుకే'కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. ఆగస్ట్ 10న టీజర్ ని లాంచ్…

Read more