‘కొరియన్ కనకరాజు’ విజువల్ ట్రీట్-‘రాసా గుమ్మడి’ సాంగ్ లో ఫుల్ మాస్ డ్యాన్స్ తో అదరగొట్టిన వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మునుపెన్నడూ లేని సరికొత్త అవతార్‌లో 'కొరియన్ కనకరాజు'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన తొలి పాట 'కంసహామ్నిదా' సినిమాపై ప్రేక్షకుల్లో బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ రోజు మేకర్స్ సినిమా నుంచి రెండో పాట 'రాసా గుమ్మడి' ని విడుదల చేశారు. తొలి పాటలో కనిపించిన కొరియన్ ఫ్లేవర్‌కు పూర్తి భిన్నంగా, ఈసారి స్వచ్ఛమైన…
