‘పెళ్లి పుస్తకం’ నుంచి ‘షష్టిపూర్తి’ వరకు ఏ నటుడికి దక్కని సినిమా జర్నీ నాకు దక్కింది – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్
నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో మా ఆయి క్రియేషన్స్ బ్యానర్ మీద రూపేశ్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 30న విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండటంతో సోమవారం నాడు కల్చరల్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘షష్టిపూర్తి’ అనేది కల్చరల్ బ్లాక్ బస్టర్ కాదు.. కల్ట్ బ్లాక్ బస్టర్. ‘పెళ్లి పుస్తకం’ నుంచి ‘షష్టిపూర్తి’ వరకు ఏ నటుడికి దక్కని సినిమా జర్నీ నాకు దక్కింది. మీడియా, ఆడియెన్స్ వల్లే మా ‘షష్టిపూర్తి’ చిత్రం ఈ…