Skip to content

‘రౌడీ అల్లుడు’ 35 ఇయర్స్ సెలెబ్రేషన్స్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ‘రౌడీ అల్లుడు’ చిత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలోనే చిరస్మరణీయమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటైన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. 'రౌడీ అల్లుడు' 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతా ఆర్ట్స్ సంస్థలో ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించారు. 1991లో విడుదలైన 'రౌడీ అల్లుడు' చిరంజీవి కామెడీ టైమింగ్, స్టైల్, స్వాగ్, డ్యాన్స్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆయన ద్విపాత్రాభినయం, చిత్రంలోని ఆసక్తికరమైన కథనం, గుర్తుండిపోయే సంగీతం కలసి ‘రౌడీ అల్లుడు’ ప్రేక్షకుల అభిమాన చిత్రంగా నిలిచిపోయింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సత్యానంద్ రచనతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. గీతా…

Read more

షూటింగ్ పూర్తి చేసుకున్న షకలక శంకర్ “శతకోటి దండాలు”

శ్రీ ముత్యం మీడియా మరియు నవ్య దివ్య ఆర్ట్స్ పతాకంపై కనకల అప్పారావు, విసినిగిరి శ్రీనివాసరావు సంయుక్త సమర్పణలో షకలక శంకర్ జెప్సీ భద్ర, మౌనిక, హీరో హీరోయిన్లుగా శ్రీ ముత్యం ఇజ్జురొత్తు దర్శకత్వంలో, అనసూయ ఇజ్జురొత్తు నిర్మాతగా రూపొందిస్తున్న ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం "శతకోటి దండాలు." ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు శ్రీముత్యం మాట్లాడుతూ "మా షకలక శంకర్ హీరోగా తెరకెక్కించిన డిఫరెంట్ మూవీ" శతకోటి దండాలు." ఈ చిత్రంలో షకలక శంకర్ రోరింగ్ పెర్ఫార్మెన్స్ చూస్తారు. షకలక శంకర్ చేసిన…

Read more

#CULT ఆడియన్స్‌ను ఒక కొత్త ప్రపంచం లోకి తీసుకెళ్తుంది: విశ్వక్‌సేన్

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్, తారక్ సినిమాస్, గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్ ‘#CULT’ డెడ్లీ సర్వైవల్ గేమ్‌ ట్రైలర్ లాంచ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ‘#CULT’ చిత్రంతో డార్క్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నారు. హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించి, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, వాస్తవ జీవితంలో చోటుచేసుకున్న భయానక ఘటనల స్ఫూర్తితో రూపొందించిన భారతదేశపు తొలి స్లాషర్ థ్రిల్లర్‌. సినిమా థియేట్రికల్ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రమాదం, హింస, ఊహించని మలుపులతో నిండిన భయానక ప్రపంచాన్ని ఈ ట్రైలర్ పరిచయం చేస్తోంది. గోవాలోని ఒక నిర్మానుష్య ఐలాండ్…

Read more

అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ సినిమా నుంచి ‘అమ్మ కనకదుర్గ’ పాటను ఆవిష్కరించిన తమన్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ను విజయవాడలో విడుదల చేశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు తమన్ స్వరపరిచిన ఈ పాటను జీ మ్యూజిక్ కంపెనీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తమన్ ఎస్ సంగీతం అందించిన ఈ పాటకు సిరాశ్రీ సాహిత్యం అందించారు. కనకదుర్గమ్మ దివ్య అనుగ్రహం, శక్తి, ఆధ్యాత్మిక విశిష్టతను చాటిచెప్పేలా ఈ పాటను రూపొందించారు. భక్తి ప్రధానంగా తెరకెక్కుతోన్న‌ ఈ చిత్రంలోని అంతర్లీన భావాన్ని ఈ పాట‌ ఆవిష్కరిస్తోంది. విజయవాడలో ఈ పాటను విడుదల చేయడం వెనుక ప్రత్యేకమైన కార‌ణం ఉంది. శ్రీ కనకదుర్గమ్మవారి ప్రసిద్ధ ఆలయం ఉన్న ఈ నగరానికి అమ్మవారితో…

Read more

27న లాస్ ఏంజెల్స్‌ అకాడమీ మ్యూజియంలో ‘రామాయణ’ హిస్టారికల్ వరల్డ్ ప్రీమియర్

రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం వరల్డ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. 2026 అక్టోబర్ 27 సాయంత్రం లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్‌లో ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ జరగనుంది. ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించే ఈ ప్రీమియర్‌కు హాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. అకాడమీ మ్యూజియం చలనచిత్ర చరిత్ర, కళ, సాంకేతికతకు అంకితమైన ప్రముఖ సంస్థ. గతంలో ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలకు, ఆస్కార్‌కు సంబంధించిన వేడుకలకు ఈ మ్యూజియం వేదికగా నిలిచింది. ఇప్పుడు ‘రామాయణ’ ప్రీమియర్ అక్కడ జరగనుండటం ఈ చిత్ర…

Read more

సాయి దుర్గ తేజ్ ‘SYG’ (సంబరాల ఏటి గట్టు) షూటింగ్ పూర్తి

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సంబరాల ఏటి గట్టు’ (ఎస్‌వైజీ) షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో కీలక మైలురాయిని చేరుకుంది. బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో ఇప్పటివరకు తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. ఈ సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రయాణం ముగిసిన సందర్భంగా మేకర్స్ ఓ బిహైండ్ ద సీన్స్ వీడియోను విడుదల చేశారు. సినిమా కోసం రూపొందించిన భారీ సెట్స్, రా అగ్రెషన్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాలు, టీమ్ మధ్య…

Read more

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా సినిమా ‘స్పిరిట్’ 2027 అక్టోబర్ 29న వరల్డ్ వైడ్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, బ్లాక్‌బస్టర్ ఫిల్మ్‌మేకర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ డ్రామా 2027 అక్టోబర్ 29న దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో వచ్చే ఏడాది బిగ్గెస్ట్ రిలీజ్‌లలో ఒకటిగా ఈ సినిమా నిలవనుంది. మేకర్స్ తాజాగా విడుదల చేసిన కొత్త రిలీజ్ పోస్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఇంటెన్స్, స్టైలిష్, మిస్టీరియస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. బ్లాక్ క్యాప్, డార్క్ సన్‌గ్లాసెస్, గడ్డంతో క్లోజప్ ప్రొఫైల్ షాట్‌లో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. డ్రామాటిక్ లైటింగ్‌తో ప్రభాస్ రఫ్ లుక్‌ను మరింత హైలైట్ చేశారు…

Read more

“క్రేజీ కల్యాణం” రివార్డులు , అవార్డ్ లు కూడా సాధిస్తుంది – డా. నరేష్ విజయ కృష్ణ

'నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందించారు. ఇటీవలే "క్రేజీ కల్యాణం" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి నీల ప్రియ మాట్లాడుతూ - క్రేజీ కల్యాణం…

Read more

దుస్తులు పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర పంపిణీ చేయడం జరిగింది. హైదరాబాద్ లోని తొర్రూర్ వద్ద ఉన్న ఈ విద్యాపీఠమ్ వద్ద దసరా నవరాత్రుల సందర్భంగా నందమూరి మోహన రూపా గారు, నందమూరి శ్రీమంతుని గారు చైర్మన్ నందమూరి మోహన కృష్ణ గారి ఆధ్వర్యంలో విద్యాపీఠమ్ లోని పెద్ద వారికి, విద్యార్థులకు అందరికీ తమ స్వహస్తాలతో వస్త్రాలను అందచేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ విద్యాపీఠమ్ లోని విద్యార్థులకు మన భారత దేశపు సంప్రదాయాలు, సంస్కృతి, విలువలు నేర్పిస్తూ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఈ గురుకులంలోని వారికి వస్త్రాలను అందచేశారు. ఈ సందర్భంగా నందమూరి మోహన రూపా…

Read more

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. విజయ్, రశ్మిక జంటగా నటించిన రణబాలి సినిమాను ఆయన వీక్షించారు. ఈ సినిమా చూసిన అనంతరం తన అనుభూతిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు సందీప్ రెడ్డి వంగా. రణబాలి సినిమాలో విజయ్ చేసిన యాక్షన్, ఫెరోషియస్ పర్ ఫార్మెన్స్ యూనిక్ గా ఉందని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ - విజయ్...నీ యాక్షన్, ఫెరోషియస్ పర్ ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. స్క్రీన్ మీద నీ ఫైట్స్ చూస్తుంటే ఆ ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాం. ఇకపై ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో…

Read more