Skip to content

‘సలార్ 2’ కోసం ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రీయూనియన్

డైనోమైట్ ద్వయం.. వైలెంట్ మ్యాన్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’తో ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిని అందించారు. ప్రముఖ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ ఫ్రాంచైజీపై అంచనాలను మరింత పెంచుతూ ‘సలార్ 2’ సీక్వెల్‌ను ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా పనులు పూర్తయిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. మరోవైపు ప్రభాస్ తన బిజీ…

Read more

‘ఒకే ఒక జీవితం’ డైరెక్టర్ శ్రీ కార్తిక్ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్‌

దక్షిణాది సినీ పరిశ్రమలో సెన్సేషన్‌గా మారిన రుక్మిణి వసంత్, దర్శకుడు శ్రీ కార్తిక్‌తో చేతులు కలిపారు. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ కొత్త సినిమా ఇప్పటికే ట్రేడ్ వర్గాలతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. హై కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కథాంశానికి తల్లీకొడుకుల మధ్య హత్తుకునే భావోద్వేగాలను జోడించి తెరకెక్కించిన ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత శ్రీ కార్తిక్ తెరకెక్కించనున్న నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటించనున్నారు. దేవ్ రామనాథ్, వినాయక్ వైద్యనాథన్…

Read more

‘ఓస్కార్ మిస్సింగ్’ చిత్ర ప్రారంభం

శ్రీమతి మాత రాజేశ్వరి సమర్పణలో భూమాత ఆర్ట్స్ బ్యానర్ట్ పై పసుపులేటి రాదా క్రిష్ణ, శివాని జంటగా చంద్రమౌళి పి.జి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం 'ఓస్కార్ మిస్సింగ్'. పవన్ మాత, నితిన్ మాత నిర్మాతలుగా అత్యంత వైభవంగా ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఓస్కార్ మిస్సింగ్ చిత్ర ప్రారంభం సందర్భంగా ఈ సినిమా మంచి కామిడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిసుతందని, ఇందులో కొన్ని నిజ జీవిత పాత్రలు కూడా వంటాయని, ఈ సినిమా ఆద్యంతం హాస్యభరితంగా ప్రేక్షకులను కేవలం నవ్వించడమే ధ్యేయంగా రూపొందించినట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ లో పూర్తి చేసి డిసంబర్ చివరికి షూటింగ్ ముగించుకుని త్వరగా విడుదలకు…

Read more

న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2026లో తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి సందడి!

కలలు, పట్టుదల, భారతీయ స్ఫూర్తికి ప్రతీకగా అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై తెలుగు మూలాలున్న రాజ్ దాసిరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2025లో 97వ ఆస్కార్ వేడుకలకు ఆహ్వానం అందుకుని అంతర్జాతీయ మీడియా, అభిమానుల దృష్టిని ఆకర్షించిన రాజ్ దాసిరెడ్డి… తాజాగా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2026లో హైప్రొఫైల్‌ ప్రదర్శనతో మరోసారి వార్తల్లో నిలిచారు. తెలుగు నేల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు సాగుతున్న ఆయన ప్రయాణం సోషల్ మీడియాలోనూ విశేష చర్చకు దారితీస్తోంది. అమెరికాలో విద్యాభ్యాసం చేయడంతోపాటు... అక్కడే ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ తీసుకుని, మోడలింగ్ నుంచి నటనలోకి ప్రవేశించి, మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన "భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు" చిత్రంతో హీరోగా పరిచయమైన రాజ్ దాసిరెడ్డి నటిస్తున్న ఓ…

Read more

నవంబర్ 13న “మాయలేడి” మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల!

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా "మాయలేడి". ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు "మాయలేడి"తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు "మాయలేడి" సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. నవంబర్ 13న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు…

Read more

“నా వైఫ్ మిస్సింగ్” ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసే సినిమా – డైరెక్టర్ హరీశ్ శంకర్

ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాను మన ముందుకు తీసుకొస్తోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రధాన పాత్రల్లో ఆహా ఒరిజినల్ "నా వైఫ్ మిస్సింగ్" నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులోకి వచ్చింది. "నా వైఫ్ మిస్సింగ్" సిరీస్ ను లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై శివ కంఠంనేని నిర్మించారు. స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు. ఈ రోజు పవర్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ అతిథిగా ఈ చిత్ర ప్రీమియర్, ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ…

Read more

మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్

హీరో, హీరోయిన్‌ని ప్రేమిస్తానంటాడు.. దానికి బ‌దులుగా ‘‘పడుచు పిల్ల కానొస్తే... ఓ నాలుగు దినాలు వెనక పడి... పని కానిచ్చుకొని... పారిపోయే టైపా? ఇష్టపడిన పిల్లని దాని బాధ్యతలతో సహా పెళ్ళి చేసుకొని దాన్ని జీవితాంతం మోసెంత గుండకాయ ఉన్న మొగోడి టైపా అని’’ ఆ పిల్ల ప్ర‌శ్నిస్తాది .. దానికి హీరో బ‌దులిస్తూ.. ‘‘సత్య ప్రమాణికంగా చెబుతున్నా ఒకతూరి మాట ఇచ్చినానంటే మడమ తిప్పని వంశం మాది... బాలయ్య బాబు టైపు’’ అని హీరో గడుసుగా సమాధానం ఇస్తాడు. హీరోయిన్ మ‌రి హీరోని ప్రేమిస్తాదా! అని తెలియాలంటే మాత్రం ‘జో జో’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. కృష్ణ క‌మ‌ల్ , మ‌హి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూర‌ల్ కామెడీ డ్రామా ‘జో…

Read more

‘రియాలిటీ’ చిత్రం నుంచి ‘భజ గోవిందం’ వీడియో సాంగ్ రిలీజ్

ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రతిష్టాత్మక చిత్రం ‘రియాలిటీ’తో నిత్యజీవితంలోని సహజమైన భావోద్వేగాలను, మన చుట్టూ ఉండే చిన్న చిన్న ఆనందాలను అందంగా ప్రజెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘క’, ‘కె-రాంప్’ చిత్రాల విజయాలతో జోరుమీదున్న ఆయన, ఈ సినిమాకు హీరోగా నటించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందించి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా, సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ సినిమా సంగీత ప్రయాణాన్ని ప్రారంభిస్తూ తొలి పాట ‘భజ గోవిందం’ ఫుల్ వీడియోను విడుదల చేశారు. గతంలో విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించగా, ఈ పాట…

Read more

‘రోమియో జూలియట్’ నవంబర్ 13న రిలీజ్

హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న ‘రోమియో జూలియట్’ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భార్గవ్ మాచర్ల రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ సమర్పిస్తుండగా, నవరస ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల నిర్మిస్తున్నారు. దసరా పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘రోమియో జూలియట్’ నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ రొమాన్స్, యాక్షన్ అంశాల కలయికతో ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో హర్షిత్ సన్‌గ్లాసెస్ ధరించి, చేతిలో గన్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. విశాఖ ధిమాన్ ఎరుపు రంగు దుస్తుల్లో అందంగా కనిపిస్తున్నారు. చుట్టూ ముళ్ల తీగలు, ఎర్ర గులాబీలు, గాలిలో ఎగురుతున్న పూలరేకులు కనిపిస్తున్నాయి. బుల్లెట్లు పోస్టర్‌కు…

Read more

హ్యాపీ బర్త్ డే టు సూపర్ స్టార్ ప్రభాస్

బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన "బాహుబలి" ప్రభాస్ పాన్ ఇండియాకు తెలుగు సినిమాను నడిపిస్తున్న నాయకుడు (సలార్) ప్రభాస్ తన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచే సైనికుడు (ఫౌజీ) ప్రభాస్ టాలీవుడ్ ను కొత్త యుగంలోకి తీసుకెళ్తున్న 'కల్కి' ప్రభాస్ డార్లింగ్స్ గర్వపడేలా చేయాలనేదే ఆయన "స్పిరిట్" క్రేజ్, స్టార్ డమ్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అలుపులేకుండా భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ తన అభిమానులను, ప్రేక్షకులను సంతోషపెడుతున్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్. ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ భారతీయ సినిమా కీర్తిని కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ 24 ఏళ్లుగా బాక్సాఫీస్ వద్ద…

Read more