మహేంద్రగిరి వారాహి థియేటర్‌లో చూడాల్సిన సినిమా : హీరో అఖిల్ అక్కినేని
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో అఖిల్ అక్కినేని ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఇలాంటి మంచి ప్రాజెక్ట్ నిర్మించిన లక్ష్మణ్ గారికి కంగ్రాచ్యులేషన్స్…
