పర్సంటేజ్ సమస్యను హరిహర వీరమల్లుకు ముడిపెట్టడం సమంజసం కాదు * టికెట్ ధరలు పెంచి సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని దూరం చేయొద్దు * కోట్లు పెట్టాం, ఐదేళ్లు తీశామని చెబితే ప్రేక్షకుడు థియేటర్ ఎందుకు వస్తాడు -ఆర్. నారాయణమూర్తి
ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడంలో తప్పులేదని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి అన్నారు. అదే సమయంలో హరిహర వీరమల్లు పేరుతో పర్సంటేజి సమస్యను పక్కదారి పట్టించారని ఆయన ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రావడం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ కుట్ర కోణం ఉందని అనుమానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ వద్ద ఇటీవల సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.... * రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అవార్డులను తెలంగాణ…