ఈ ఘనత నా ఒక్కడిదే కాదు మన టాలీవుడ్ లో ప్రతి ఒక్కరిది!!
ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకం నిర్మాతగా డబుల్ సెంచరీ సాధించడం నా జీవితాశయం -వరల్డ్ రికార్డ్ హోల్డింగ్ ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన వ్యక్తిగా డా: డి.రామానాయుడు చరిత్రకెక్కితే... ఒకేరోజు 15 చిత్రాలు ప్రారంభించిన నిర్మాతగా ప్రపంచ రికార్డు సాధించారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అంతేకాదు ఈ 15 సినిమాలు ఏడాది వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే స్థిర సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ శతాధిక చిత్ర నిర్మాత తన పుట్టిన రోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు!! తన వల్ల తెలుగు సినిమాకి ఓ గొప్ప గౌరవం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని తుమ్మలపల్లి పేర్కొన్నారు. అయితే ఈ ఘనత…
