‘మార్గన్’ నుంచి ‘సోల్ ఆఫ్ మార్గన్’ సాంగ్ రిలీజ్
హీరోగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోని ‘మార్గన్’ అంటూ జూన్ 27న ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. జూన్ 27న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా సోల్ ఆఫ్ మార్గన్ అంటూ ఓ…