మెగా బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర బృందానికి ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ శుభాకాంక్షలు
నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సంచలనాలు సృష్టించారు. తాజాగా 'మన శంకర వరప్రసాద్ గారు'తో మరోసారి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. మెగా అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా మలిచిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, చిరంజీవి సినీ ప్రయాణంలో అతి…
