Skip to content

ఘనంగా ఘంటసాల ది గ్రేట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇది మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వేంకటేశ్వరరావు (ఘంటసాల) బయోపిక్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కింది. సి.హెచ్. రామారావు దర్శకత్వంలో ‘ఘంటసాల ది గ్రేట్’ అనే టైటిల్‌తో డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని, ఆయన లైఫ్ లోని విభిన్న ఘట్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య…

Read more

పాల్వంచలో అట్టహాసంగా గుమ్మడి నర్సయ్య బయోపిక్ ప్రారంభోత్సవ వేడుక

పేదల పక్షపాతి, సైకిల్ పై అసెంబ్లీకి వెళ్లిన ఇల్లందు సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే. ‘గుమ్మడి నర్సయ్య’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో కన్నడ హీరో శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 6) పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రయూనిట్ తో పాటు సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కవిత సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మొదటి సన్నివేశానికి గీతా శివరాజ్ కుమార్…

Read more

ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా వారి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ ‌ ఛైర్మన్‌ సంజయ్‌కిషోర్‌ నిర్వహణలో హైదరాబాద్‌ లో సావిత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సావిత్రి గారి ఫొటోలతో అందంగా తీర్చిదిద్దిన వేదిక పై జరిగిన ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ- మహానటికి మరణం లేదని, నవరస అద్భుత నటనా కౌశలంతో ప్రేక్షకులను మైమరపించేవారని అన్నారు. తన నట జీవితంలో ప్రతి చిత్రంలో కూడా కేవలం పాత్ర మాత్రమే కనిపించేదని, సావిత్రి కనిపించేది కాదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ-…

Read more

ఇట్స్‌ ఓకే గురు అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది : ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మెహర్ రమేష్

సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం 'ఇట్స్ ఓకే గురు'. మణికంఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రాంతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 12 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఇట్స్ ఓకే గురు' టైటిల్ చాలా బాగుంది. అందరికీ రీచ్ అయింది. కంటెంట్ చూస్తుంటే లవ్ స్టోరీలా అనిపిస్తుంది. విజువల్స్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. లవ్ స్టోరీ కి మ్యూజిక్ విజువల్స్ బాగుంటే 60% సినిమా హిట్ అయినట్టే. సినిమాని మంచిగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. హీరో…

Read more

‘ఛాంపియన్’ లో కీలక పాత్రతో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ కొత్తదనం ఉన్న కథలకు ప్రాధాన్యమిస్తూ, విభిన్నమైన కథాంశాలు, అద్భుతమైన క్రియేటివ్, కాస్టింగ్‌ సెలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. వారి తాజా చిత్రం 'ఛాంపియన్' జీ స్టూడియోస్‌ సమర్పణలో రూపొందుతున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా. అనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిలిమ్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో కూడా స్వప్న సినిమాస్ తమ ప్రత్యేకతని కొనసాగిస్తోంది. యంగ్ ఛాంప్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ సంచలనం అనశ్వర రాజన్ తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతుంది. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. 80వ దశకంలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన నందమూరి కల్యాణ్ చక్రవర్తి కం బ్యాక్ ఇస్తున్నట్లు చిత్రబృందం…

Read more

ఈషా’ సినిమా చూశాక రియలెస్టిక్ ఫీల్ తో థియేటర్స్ నుంచి బయటకు వస్తారు – నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

ప్రముఖ కథానాయిక జెనీలియా ప్రధాన పాత్రలో రూపొందిన 'కథ' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె, కొంత విరామం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఈషా'. ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ హారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి…

Read more

వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో ‘పోలీస్ కంప్లెయింట్’ షూటింగ్ పూర్తి

గ్లామ‌ర్ పాత్ర‌లతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గానూ పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఆడియ‌న్స్‌ను థ్రిల్‌కు గురి చేసే క్యారెక్ట‌ర్‌తో రాబోతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న ‘పోలీస్ కంప్లెయింట్’ మూవీ ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో వరలక్ష్మి ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో కనిపించ‌నుందని, తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో నటించడం ప్రత్యేక ఆకర్షణ అని, సూపర్ స్టార్ కృష్ణ గారిపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు. MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపోందుతున్న ఈ…

Read more

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’

సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ థ్రిల్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' ను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఈ సిరీస్ లో మొత్తం 50 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' సిరీస్ అందుబాటులో ఉంది. ఈ వెబ్ సిరీస్‌కు జెస్విని దర్శకత్వం వహించారు. అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, గురు, ప్రీతి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ కు అశ్వతన్ మ్యూజిక్ అందించారు. ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రి మూడు…

Read more

‘కామాఖ్య’ ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్ లాంచ్

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లింగ్ 'కామాఖ్య'. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ మంత్రి సీతక్క 'కామాఖ్య' ఫస్ట్ లుక్ లాంచ్ చేసి టీంకు అభినందనలు తెలియజేశారు. ఇంటెన్స్, థ్రిల్లింగ్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ యూనిక్ కథని సిద్ధం చేశారు. ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి…

Read more

‘నారి నారి నడుమ మురారి’ 2026 సంక్రాంతికి రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ఇది ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ ఎక్సయిటింగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. నారి నారి నడుమ మురారి 2026లో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇది తెలుగు సినిమా…

Read more