Skip to content

కేవలం 4 గంటల్లోనే $100K ప్రీ-సేల్స్ తో నార్త్ అమెరికాలో ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ చరణ్ ‘పెద్ది’

కేవలం 4 గంటల్లోనే $100K ప్రీ-సేల్స్ తో నార్త్ అమెరికాలో ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ చరణ్ ‘పెద్ది’ Telugu News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలోకి రాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తుఫాన్‌లా దూసుకెళ్తున్నాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం నాలుగు గంటల్లోనే సినిమా 100K డాలర్ల మార్క్‌ను దాటేసి ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ట్రైలర్ కూడా విడుదల కాకముందే ఈ స్థాయి ఓపెనింగ్ రావడం సెన్సేషనల్ గా మారింది. రామ్ చరణ్ స్టార్ పవర్‌పై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం, బుచ్చిబాబు స్టొరీ టెల్లింగ్ ప్రత్యేకత కలిసివచ్చి ఈ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.

నార్త్ అమెరికా రిలీజ్ ప్రత్యంగిరా సినిమాస్ నిర్వహిస్తోంది. వారి రిలీజ్ ప్లానింగ్ కూడా భారీ స్థాయిలో ఉంది. నార్త్ అమెరికాతో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, సింగపూర్ సహా పలు దేశాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఇప్పటివరకు ‘పెద్ది’ నుంచి విడుదలైన రెండు పాటలు, రెండు గ్లింప్స్, పోస్టర్లు.. ప్రతి అప్డేట్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. రస్టిక్ మూడ్, రూరల్ బ్యాక్ డ్రాప్, రామ్ చరణ్ రగ్గ్డ్ లుక్ అన్నీ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

ఇప్పటికే ఫైనల్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైతే ఈ హైప్ మరింత రెట్టింపు అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.

‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుండగా, జూన్ 3 నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.