Skip to content

‘పెద్ది’ చికిరి చికిరి సాంగ్ 200 మిలియన్లకు పైగా వ్యూస్ రికార్డులు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి తో మ్యూజిక్ ప్రమోషన్స్ అద్భుతంగా ప్రారంభించింది. ఈ ట్రాక్ ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ఐదు భాషలలో 200 మిలియన్లకు పైగా వ్యూస్ కు చేరుకుంది.

AR రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట అదిరిపోయే బీట్, ఎనర్జీ, ఫెస్టివల్ వైబ్, రామ్ చరణ్ వైరల్ డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసింది.‘చికిరి చికిరి’ ఇప్పటికే భారీ రిపీట్ వాల్యూను సాధిస్తూ 2 మిలియన్‌కు పైగా లైక్స్‌ను, మ్యూజిక్ ప్లాట్‌ఫాంలలో 60 మిలియన్‌కు పైగా ఆడియో స్ట్రీమ్స్‌ను రాబట్టి చార్ట్‌లను ఏలుతోంది. మ్యూజిక్ లవర్స్‌, సినిమా అభిమానులు ఈ పాటను మళ్లీ మళ్లీ వింటూ ప్రతి రోజు ప్లేలిస్ట్‌లో తప్పనిసరిగా ఉండే పాటగా మార్చేశారు.

ఈ పాట వైరల్ తుఫాను సోషల్ మీడియాను ముంచెత్తింది. 300K కంటే ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ , 870K యూట్యూబ్ షార్ట్స్‌లో నెటిజన్లు ఐకానిక్ హుక్ స్టెప్‌ను రిక్రియేట్ చేస్తున్నారు, ఇది యంగ్ ఆడియన్స్ లో గ్లోబల్ మూమెంట్ గా మారింది.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించిన ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్.

మార్చి 27న పెద్ది గ్రాండ్ పాన్-ఇండియా థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.