Skip to content

మే 22న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం రిలీజ్

మే 22న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం రిలీజ్ Telugu News
సంజీవ్ మేగోటి దర్శకత్వంలో హారర్–యాక్షన్ థ్రిల్లర్
▪️ న‌టుడు కృష్ణ‌సాయి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ కృష్ణ‌పై స్పెష‌ల్ సాంగ్ విడుద‌ల‌
▪️ 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో నిర్మాణం
▪️ వరలక్ష్మి శరత్‌కుమార్ కొత్త షేడ్స్ – నవీన్ చంద్ర వెర్సటైల్ రోల్
▪️ విభిన్న కథ, పవర్‌ఫుల్ పాత్రలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్

విలనిజం అయినా, క్యారెక్టర్ రోల్ అయినా.. తనదైన పవర్‌ఫుల్ నటనతో స్క్రీన్‌పై మ్యాజిక్ చేసే నటి వరలక్ష్మి శరత్‌కుమార్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో వెర్సటైల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సరికొత్త, భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ మూవీ మే 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించిన కృష్ణసాయి బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న అభిమాన న‌టుడు
సూప‌ర్ స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెష‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. : వరలక్ష్మి శరత్‌కుమార్ గారు, నవీన్ చంద్ర చంద్ర గారి క్రేజీ కాంబినేష‌న్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం. ఈ సినిమా కథ, పాత్రల నిర్మాణం ప్రత్యేకంగా ఉంటూ ప్ర‌తి ఒక్క‌రిని ఖ‌చ్చితంగా అల‌రిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. మే 22న విడుద‌ల‌య్యే ఈ సినిమాను ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌రించాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుకుంటున్నాం.. అని అన్నారు.

ఈ సినిమా సంజీవ్ మేగోటి వెర్సటైల్ డైరెక్ట‌ర్‌గా గ‌తంలోనూ ఎన్నో హిట్ సినిమాలు తెర‌కెక్కించారు.
అఘోర, పౌరుషం, ఆప్త, దండు, రాఘవరెడ్డి, ఆదిపర్వం.. వంటి సినిమాల‌తో క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో విభిన్నమైన కథా నేపథ్యం, బలమైన నటీనటుల సమాహారం, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందుతున్న ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా విడుదలకు ముందే ఇండ‌స్ట్రీలో భారీ అంచనాలు సొంతం చేసుకుంటోంది.

ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తం 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు
.న‌టీన‌టులు: వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు.
బ్యాన‌ర్: ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్
నిర్మాత‌: బాలకృష్ణ మహారాణా
క‌థ‌, స్క్రీన్‌ప్లే ద‌ర్శ‌క‌త్వం: సంజీవ్ మేగోటి
సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో
సినిమాటోగ్రఫీ: S.N. హరీష్ సొండెకొప్ప
ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్–రవితేజ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌: సంజీవ్ మేగోటి
ఆర్ట్ డైరెక్ట‌ర్: కేవీ ర‌మ‌ణ‌
ఎడిటింగ్: అనుగోజు రేణుకా బాబు
మేకప్: విజయ్–శేఖర్,
కాస్ట్యూమ్స్‌: నల్లపు సతీష్
ప్రొడక్షన్ డిజైనర్‌: కొండపనేని మురళీధర్
పీఆర్ఓ: అశోక్ ద‌య్యాల‌

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.