Skip to content

ప్రేమ్ రక్షిత్‌ మాస్టర్ పై ప్రశంసలు కురిపించిన హాలీవుడ్ కొరియోగ్రాఫర్ విన్సెంట్ పాటర్సన్

ప్రపంచ ప్రఖ్యాత పాప్ ఐకాన్ మైకేల్ జాక్సన్ కోసం ఐకానిక్ డాన్స్ మూవ్స్ రూపొందించిన లెజెండరీ కొరియోగ్రాఫర్ విన్సెంట్ పాటర్సన్, భారతీయ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ పై ప్రశంసలు కురిపించారు.
ప్రేమ్ రక్షిత్ రూపొందించిన డాన్స్ కంపోజిషన్స్‌, ఆయన క్రియేటివిటీపై విన్సెంట్ పాటర్సన్ ఆనందం వ్యక్తం చేశారు. ‘సినిమా రంగంలో మీ వర్క్ ని నేను ఎంతో అభినందిస్తున్నాను. మీరు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉండటం చాలా సంతోషంగా ఉంది ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు భారతీయ సినీ పరిశ్రమకు గొప్ప గుర్తింపుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రెబల్ ప్రభాస్ తో ప్రేమ్ రక్షిత్‌ మాస్టర్ ఒక హాలీవుడ్ స్థాయి సినిమా చేసే అవకాశంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి. ఈ వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.