‘లవ్ & వార్’ నుండి ఆకట్టుకుంటున్న అలియాభట్ ఫస్ట్ లుక్
రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ & వార్’ చిత్రంలో అలియా భట్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అలియా ఇంతకుముందెన్నడూ కనిపించని గ్లామరస్ లుక్‌లో మెరిసింది. 2027లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘లవ్ & వార్’ ఒకటి. ఈ సినిమాలో సంజయ్ లీలా భన్సాలీ తన గత చిత్రాలకు భిన్నమైన ఆధునిక ప్రపంచాన్ని చూపించబోతున్నారు. మేకర్స్ సోషల్ మీడియాలో అలియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ పోస్టర్‌లో అలియా స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని కనిపించింది. ఆమె లుక్, స్టైలింగ్, హావభావాలు రెట్రో ఫీల్‌ను అందిస్తున్నాయి. ఈ…
