మన ఆది హిట్టు కొట్టాడని అందరూ ఫోన్స్ చేసి చెబుతున్నారు.. సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో సాయి కుమార్
చాలా కాంపీటిషన్‌లో విడుదలైనా కూడా ఆ మూవీ పెద్ద హిట్ అయింది.. సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో ఆది సాయి కుమార్ వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శంబాల’. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో వేసిన ప్రీమియర్లకు మంచి స్పందన రావడం, మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్లతో చిత్రం దూసుకుపోతోండటంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గురువారం నాడు సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘మా నాన్న గారు…
