పవన్ కళ్యాణ్ గారితో అరగంట భేటీ.. కీలక ప్రాజెక్టుపై చర్చించాం: అజయ్ అరసాడ
‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ అరసాడ.. వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. తన సినీ ప్రయాణం, సంగీతంపై తన అభిప్రాయాలు, ఏఐ ప్రభావం, పవన్ కళ్యాణ్‌తో జరిగిన భేటీ తదితర అంశాల గురించి ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది? మాది వైజాగ్. మా కుటుంబంలోనే ఆర్ట్, మ్యూజిక్‌కు మంచి అనుబంధం ఉంది. టీసీఎస్‌లో దాదాపు ఏడేళ్లు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే రెండు సినిమాలకు పని చేశాను. దేవీ శ్రీ ప్రసాద్ నాకు ఎంతో స్ఫూర్తి. మా అమ్మ, భార్య ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి రాగలిగాను. వైజాగ్‌లో శ్రీ చరణ్…
