ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌ల నియంత్రణకు అమిత్ షాను కలిసిన చిరంజీవి
కళాకారులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, మార్ఫింగ్ చేసిన వీడియోలను రూపొందించడంపై ఇటీవల ఎక్స్ వేదికగా తన ఆందోళనను వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ అంశంపై మరో కీలక అడుగు వేశారు. ఈ రోజు హైదరాబాద్‌లో గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి, ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్ సమస్యలను వివరించారు. ఈ భేటీలో చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీలను దుర్వినియోగం చేస్తున్న తీరును స్వయంగా వివరించేందుకు చిరంజీవి ఈ భేటీకి అపాయింట్‌మెంట్ కోరారు. ఈ సాంకేతికతల దుర్వినియోగం కళాకారుల హక్కులు, గౌరవం, క్రియేటివ్ కంటెంట్‌కు ముప్పుగా మారుతోందని ఆయన వివరించారు. ఈ సమస్యను కేవలం సోషల్ మీడియా వేదికకే…
