డాక్టర్ గా వైద్యం – హీరోగా వినోదం అందించాలన్నదే నా ధ్యేయం!!
డాక్టర్ టర్నెడ్ హీరో పవన్ మహావీర్ ఆగస్టు 7 విడుదలకు సిద్ధమవుతున్న "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి" జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ... ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి". పవన్ మహావీర్ లండన్ లో వైద్య విద్య అభ్యసిస్తూ హీరోగా నటించడం విశేషం. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల…
