డిసెంబరు 4 నుంచి జీ5లో సైకలాజికల్ థ్రిల్లర్ ‘దాలింబ్’ స్ట్రీమింగ్
ప్రేక్షకులకు విభిన్న కథాంశాలతో కూడిన వినోదాన్ని అందిస్తున్న ఓటీటీ వేదిక జీ5 మరో ఆసక్తికరమైన చిత్రంతో ముందుకొస్తోంది. జితేంద్ర కుమార్, ప్రియ బాపట్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘దాలింబ్’. ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఎలిప్సిస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో ప్రియా అవెన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 4 నుంచి ప్రత్యేకంగా హిందీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ముంబయి శివారు ప్రాంతాల్లోని మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఒక చిన్నారి అదృశ్యం కావడం, మానసిక చికిత్స కేంద్రం నుంచి ఓ వ్యక్తి తప్పించుకోవడం.. ఈ రెండు మిస్టరీల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ కేసుల దర్యాప్తు ఎలాంటి మలుపులు తీసుకుంది? ఈ…
