Skip to content

‘బాల 369’ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను: హీరో నిఖిల్ సిద్ధార్థ

‘జయమ్మ పంచాయతీ’ ఫేమ్ విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో అర్విన్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బాల 369’. ‘అటజని కంచె’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. అర్విన్ ఆర్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య నిర్మిస్తున్నారు. వైవా హర్ష సమర్పిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం నవంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు హీరో నిఖిల్ సిద్ధార్థ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హీరో నిఖిల్ సిద్ధార్థ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. స్వతహాగా ఎదిగిన నటుడు హర్ష. ఈ సినిమాతో తను ప్రజెంటర్ గా మారారు. తన జర్నీ చాలా ఫెంటాస్టిక్‌గా, ఇన్‌స్పిరేషనల్. ఆర్విన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. తనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నాను. డైరెక్టర్ విజయ్ గారు ఇంతకుముందు ‘జయమ్మ పంచాయతీ’ అనే అద్భుతమైన సినిమా తీశారు. ఈ రెండో సినిమాతో ఆయన పెద్ద కమర్షియల్ సక్సెస్ కొట్టబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌లోనూ, కంటెంట్‌లోనూ, నటీనటులందరిలోనూ పాజిటివిటీ ఉంటుంది. అదే పాజిటివ్ ఎనర్జీతో ఆడియన్స్ వచ్చి సినిమా చూస్తే కచ్చితంగా మీరందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నిజంగా ఈ కాన్సెప్ట్ చాలా బ్రిలియంట్‌గా ఉంది. ఇంత బడ్జెట్‌లో 15 దేశాల్లో ఈ సినిమాను షూట్ చేయడం మామూలు విషయం కాదు. మీరందరూ థియేటర్‌లో కూర్చుని ఒక ప్రపంచ యాత్ర చేయాలంటే ‘బాల 369’ సినిమాకు రండి. మీకు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. కచ్చితంగా ఈ సినిమా చాలా మంచి సినిమా కాబోతోంది. సినిమా బాగుంటే ప్రేక్షకులు వస్తున్నారు. బిగ్ స్క్రీన్ కోసం సినిమా తీయండి. మంచి స్పాన్ ఉన్న సినిమా తీయండి. కచ్చితంగా థియేటర్స్‌కు జనం వస్తారు. ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను.”

డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. అల్లసాని పెద్దన రచించిన ‘మనుచరిత్ర’లోని ‘అటజని కాంచే’ పద్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథను రాశాను. నా తెలుగు ఉపాధ్యాయులకు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి తెలుగు ఉపాధ్యాయులకు అంకితం చేస్తున్నాను. ఈ సినిమాను చాలా దేశాల్లో షూట్ చేశాను. కాశ్మీర్‌లో షూట్ చేసినప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. షూటింగ్ కోసం కొన్ని నకిలీ తుపాకులు కావాలి. అవి అక్కడ దొరకలేదు. కృష్ణానగర్ నుంచి తీసుకెళ్తున్నప్పుడు ఎయిర్‌పోర్టులో పోలీసులు, ఆర్మీ అధికారులు నన్ను అడ్డగించి చుట్టుముట్టారు. దాదాపు గంటపాటు విచారించారు. నేను సినిమా దర్శకుడినని తెలిసిన తర్వాత విడిచిపెట్టారు. 15 దేశాల్లో ఈ సినిమాను షూట్ చేశాం. ఈ జర్నీని ఎంతో ఆస్వాదించాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా ప్యాషన్‌తో పనిచేశాను. ఎన్నో కొత్త అనుభవాలను పొందాను. ఈ సినిమా ప్రతి ఇంట్లో ఒక డిస్కషన్ అవుతుంది. చాలా ఫ్రెష్ కంటెంట్, గ్రేట్ స్క్రీన్‌ప్లే ఉంటుంది. వైవా హర్ష గారికి ధన్యవాదాలు. హర్ష గారు, గెటప్ శీను గారు, వెన్నెల కిషోర్ గారు.. అందరూ అద్భుతమైన నటులు. సింగిల్ టేక్ ఆర్టిస్టులు. వీళ్లందరితో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయాలని ఉంది.మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, రైటింగ్ డిపార్ట్‌మెంట్ అందరికీ థాంక్యూ. అందరూ సినిమాను థియేటర్‌లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.”

హీరో అర్విన్ తేజ్ మాట్లాడుతూ.. “నిఖిల్ గారు ఈ వేడుకకు రావడం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఇది మా హర్ష గారి వల్ల సాధ్యమైంది. ‘బాల 369’ సినిమా గురించి కంటెంటే మాట్లాడుతుంది. మీరు థియేటర్‌కు రండి. సినిమా బాగాలేకపోతే పది మందికి చెప్పండి. బాగుంటే ఒక్కరికి చెప్పండి. ఎందుకంటే సినిమా మీద అంత నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమా నాకు చాలా జీవిత పాఠాలు నేర్పింది. సినిమా చాలా క్రియేటివ్‌గా ఉంటుంది. ఒక్క నిమిషం కూడా ఎక్కడా బోర్ కొట్టదు. హర్ష గారు సినిమా చూసి ఇందులో భాగమవ్వాలనుకున్నారు. అలాగే సినిమాలో నటించిన మిగతా నటీనటులందరికీ థాంక్యూ. మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి కథను నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.”

వైవా హర్ష మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన నిఖిల్ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. అందుకే ప్రజెంట్ చేయాలనిపించింది. డైరెక్టర్ గారు చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆర్విన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. ఇది చిన్న సినిమా అయినప్పటికీ 15 దేశాల్లో చిత్రీకరించాం. చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా. మీరందరూ థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా. ఆర్విన్‌కు సినిమా అంటే చాలా ప్యాషన్. మన దగ్గర పెద్ద బడ్జెట్ లేకపోయినా ఎంత గ్రాండ్ విజువల్స్ తీయవచ్చో నిరూపించడానికి ఈ సినిమా ఒక కేస్ స్టడీగా ఉంటుంది. ఈ సినిమాను ప్రజెంట్ చేయడం చాలా గర్వంగా ఉంది. నవంబర్ 27న రిలీజ్ అవుతుంది. కచ్చితంగా అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను.”

నిర్మాత ఎల్లయ్య మాట్లాడుతూ.. “అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆర్విన్‌కు సినిమా అంటే చాలా ఇష్టం. డైరెక్టర్ గారు అన్ని విధాలుగా ఈ సినిమా విషయంలో మాకు ఎంతో సహకారం అందించారు. మా అబ్బాయి సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సాధారణంగా ఒక తండ్రి వల్ల పిల్లలకు పేరు వస్తుంది. కానీ ఈ సినిమాతో తన వల్ల మా కుటుంబానికి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే అందరూ కూడా ఎంతో సహకారం అందించారు. ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన హీరో నిఖిల్ గారికి ధన్యవాదాలు. సినిమాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.