హైదరాబాద్: మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటగిరి హ్యాండ్లూమ్స్ షోరూమ్‌ను ప్రముఖ సినీ నటి లయ…
‘ఆకాశంలో ఒక తార’ రెండో వారం మరింత సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది: నిర్మాత అల్లు అరవింద్
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాత్విక వీరవల్లి కథానాయికగా నటించగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. నవంబర్ 20న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రెమండస్ రెస్పాన్స్‌తో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు ఇచ్చింది.
అరవింద్ గారు.. ‘ఆకాశంలో ఒక తార’తో విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్యులేషన్స్.
మీరు సినిమా చేస్తున్నారంటే చాలా కమర్షియల్ లెక్కలు వేసుకుంటారు కదా! ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి ఆలోచన చేశారు?
-ప్రేక్షకుల హృదయాలను కదిలించడం ఒక కమర్షియల్ లెక్క. ఈ సినిమాతో అదే చేశాం. సినిమా చూసిన ప్రేక్షకులందరూ చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. అదే రకంగా కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. సోమవారం కూడా అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. రెండో వారం కూడా మొదటి వారం కంటే ఎక్కువగా ఉంటుందా అన్నంత ఉధృతంగా సినిమా రన్ అవుతోంది. ఈ సినిమాకి చాలా అవార్డులు కూడా వస్తాయనే నమ్మకం ఉంది.
-అశ్వినీ దత్ గారితో కలిసి ఏడు సినిమాలు చేశాను. ఇప్పుడు దత్ గారి అమ్మాయి స్వప్నతో చాలా బలమైన కథతో సినిమా చేయడం మాకు సంతోషాన్నిచ్చింది. స్వప్నతో కనీసం ఏడు సినిమాల ప్రయాణం ఉంటుంది.
-గంగరాజు గారు స్క్రీన్‌ప్లే రాయడం.. అనీ ద్భుతంగా కుదిరాయి. దర్శకుడు పవన్, నిర్మాత సందీప్ ఈ కథను నమ్మి మొదటి నుంచి చాలా నమ్మకంగా ప్రయాణం చేశారు. వారి నమ్మకం నిజమైంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు పవన్ మాతోనే సినిమా చేస్తున్నారు. అలాగే సాత్వికతో రెండు సినిమాలు చేస్తున్నాను.
– గంగరాజు లాంటి స్నేహితుడు ఉండడం చాలా గర్వంగా ఉంది. ఆయన అద్భుతమైన ప్రతిభ ఉన్న రచయిత. ఆయనకు కథ నచ్చితేనే స్క్రీన్‌ప్లే రాస్తారు. ఇప్పటికీ నా సినిమాలకు స్క్రీన్‌ప్లే రాస్తారా అని అడుగుతుంటాను. కథ నచ్చితేనే రాస్తానని చెబుతారు.
పవన్ గారు.. ఈ విజయం మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది?
-ఇదొక బ్యూటిఫుల్ ఫీలింగ్. ముందు నుంచి ఈ కథే మా అందరినీ ఎంపిక చేసుకుందని భావించాం. ఈ కథకు ఏం కావాలో అది తీసుకుంది. మేము అనుకున్నట్టుగానే సినిమా అద్భుతమైన విజయం సాధించింది. బన్నీ గారు నా మొదటి సినిమా నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఏదైతే చెప్పారో, అది ఈరోజు రిజల్ట్ రూపంలో వచ్చింది. చాలా గర్వంగా ఉంది.
-గంగరాజు గారు స్క్రీన్‌ప్లే అద్భుతంగా రాశారు. ఏది ఎక్కడ ఓపెన్ చేయాలి? ఎక్కడ హై రావాలి? అవన్నీ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి. కల్పన, కృష్ణ రిలేషన్, ఆ జర్నీలో వచ్చే పాత్రలు.. అవన్నీ బ్యూటిఫుల్‌గా కుదిరాయి.
స్వప్న గారు.. మీ సంస్థ నుంచి ఒకవైపు కమర్షియల్ సినిమాలు, మరోవైపు మంచి కథాబలం ఉన్న సినిమాలు కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి?
మంచి కథలు చెప్పే జర్నీలా చూస్తే చాలు. ‘కల్కి’ ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయినప్పటికీ, కథే దానికి బలం. అది సమాజానికి ఉపయోగపడే సినిమా కూడా. మా జర్నీ మొదలైనప్పటి నుంచి ఇలాంటి మంచి కథలు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయని భావిస్తున్నాను. ఒకటి రెండు మంచి సినిమాలు చేస్తే ఆటోమేటిగ్గా అలాంటి మంచి కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయని నమ్ముతున్నాను. ఆ నమ్మకం ‘ఆకాశంలో ఒక తార’తో మరోసారి రుజువైంది.
-వర్డ్ ఆఫ్ మౌత్‌ను మించిన ప్రమోషన్ ఏదీ ఉండదని నేను నమ్ముతాను. సినిమా తనంతట తానే బలంగా మాట్లాడుతుంది. ‘ఆకాశంలో ఒక తార’ విషయంలో అదే జరిగింది.
-అరవింద్ గారితో, గంగరాజు గారితో, అలాగే సింగీతం గారితో కలిసి పనిచేయడం.. నా ఏజ్‌కు మించి నాకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాను.
-దుల్కర్‌తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. తను ‘మహానటి’ సినిమాలో భాగమైనప్పుడు కూడా సావిత్రి గారి కథకు ప్రాధాన్యత ఇచ్చారు. క్యారెక్టర్ కంటే స్టోరీ గొప్పదని నమ్మే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. దుల్కర్ అలాంటి వ్యక్తి. తనకు కథే ముఖ్యం. అందుకే మంచి సినిమాలు తనను వెతుక్కుంటూ వెళ్తున్నాయని భావిస్తాను.
సాత్విక గారు.. మీరు ఎన్నారై కదా! ఇందులో ఒక విలేజ్ అమ్మాయి క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది?
-నిజానికి నా పర్సనల్ క్యారెక్టర్‌కు, ఇందులోని కల్పన క్యారెక్టర్‌కు చాలా వ్యత్యాసం ఉంది. ఆ బాడీ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకోవడం చాలా డిఫికల్ట్. రాజమండ్రిలో జరిగిన ఫస్ట్ షెడ్యూల్ సమయంలో అక్కడ చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను. అలాగే శ్రుతి హాసన్ గారు, దుల్కర్ గారు.. ఇలా అందరి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆడియన్స్ ఆ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ ఇవ్వడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
రుహాని గారు.. బిజిలి పాత్రకు ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఎలా అనిపించింది?
-బిజిలి క్యారెక్టర్‌కు ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని నేను ఊహించలేదు. కథలో తనది చాలా కీలకమైన పాత్ర. ఆడియన్స్‌కు ఆ పాత్ర అద్భుతంగా కనెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇందులో నేను మాట్లాడిన యాసకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది సమాజాన్ని పరిశీలించి, అక్కడి నుంచి తీసుకున్న యాస. ఆ పాత్రలో ఒక నిజాయితీ ఉంది. నాకు మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. అది బిజిలి క్యారెక్టర్‌తో రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
గంగరాజు గారు.. ఈ సినిమా రివ్యూల్లో చాలామంది కన్వీనియన్స్ గురించి మాట్లాడారు. ఆ ఫీడ్‌బ్యాక్ మీకు ఎలా అనిపించింది?
-కన్వీనియన్స్ ఉందని అనుకోవచ్చు. కొన్ని విషయాలను డ్రమటైజ్ చేయలేకపోవడం వల్ల అది కన్వీనియన్స్ అనిపించొచ్చు. కల్పన ఒంటరిగానే ప్రయాణం చేసింది. చివరికి తన అంతరిక్ష ప్రయాణంలో కూడా ఒంటరిగానే వెళ్లింది. కథలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్లడం జరిగింది. ఆ అమ్మాయి ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు ఇంకా ఉన్నాయి. బ్యాక్‌స్టోరీలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆడియన్స్‌కు ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని, ఈ కథకు ఏం కావాలో అది రాయడం జరిగింది. అది ప్రేక్షకులకు చాలా మంచి అనుభూతిని ఇచ్చింది.
సందీప్ గారు.. ఈ కథను మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి?
-మనం కథ విన్న తర్వాత దాన్ని స్క్రీన్ మీద చూడాలనే ఆసక్తి క్రియేట్ అవ్వాలి. ఈ కథ విన్నప్పుడు అలాంటి ఆసక్తి కలిగింది. ఒక కథను స్క్రీన్ మీద చూడాలి అని అనిపిస్తే, ఆ కథ కోసం ఎంత దూరమైనా వెళ్లాలి. మొదటి నుంచి మా జర్నీని అలాగే కొనసాగిస్తున్నాం.

