Skip to content

అర్జున్ సర్జా ప్ర‌ధాన పాత్ర‌ధారిగా భారీ బ‌డ్జెట్ మూవీ

  • న‌వంబ‌ర్ 27న శ్రీరామ జ‌న్మ‌భూమి అయోధ్య‌లో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించుకోనున్న‌ చారిత్రాత్మ‌క చిత్రం

తనదైన నటన, అద్భుతమైన యాక్షన్ పాత్రలతో హీరోగా, డైరెక్ట‌ర్‌గా భారతీయ ప్రేక్షకుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న యాక్ష‌న్ కింగ్ అర్జున్ సర్జా ప్ర‌ధాన పాత్ర‌లో ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌పై అనూప్ మోహ‌న్ నిర్మాత‌గా భారీ బ‌డ్జెట్‌తో దేశ‌భ‌క్తి సినిమా రూపొంద‌నుంది. ఈ ప్రెస్టీజియ‌స్ మూవీ న‌వంబ‌ర్ 27న శ్రీరామ జ‌న్మ‌భూమి అయోధ్య‌లో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకోనుంది. అదే రోజున టైటిల్‌ను కూడా అనౌన్స్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా రూపొందనున్న ఈ దేశ‌భ‌క్తి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ జన్మభూమి అయోధ్య‌ ఆలయంలో సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా నిలవనుందని టీమ్ వెల్ల‌డించింది. అర్జున్ స‌ర్జా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో పాటు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను కూడా నిర్వ‌హించ‌నున్నారు.

బాలీవుడ్‌తో పాటు వివిధ ప్రాంతీయ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగస్వాములు కానున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలోని పలువురు ప్రముఖులతో కూడిన భారీ పాన్ ఇండియా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది.అనూప్ మోహ‌న్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి జోస్ ఎం. థామస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

బలమైన కథాంశం, ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా దేశభక్తి, ధైర్యసాహసాలు, త్యాగం, భారతదేశ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్నారు. ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌లో రూపొంద‌నున్న మూడ‌వ ప్రెస్టీజియ‌స్ మూవీ ఇది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.