పెద్ది’ కథ విన్న తర్వాత 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయాను: ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? -నా పదేళ్ల కెరీర్‌లో ఒక కథకి ఇంతలా ఎక్సైట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. డైరెక్టర్ గారు…
