‘సైరాబాను’ మొదటి షెడ్యూల్ పూర్తి- సరదాగా సాగే BTS వీడియో రిలీజ్
శంబాల ఘనవిజయంతో మంచి జోష్‌లో ఉన్న హీరో ఆది సాయి కుమార్, ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్,కమర్షియల్ అంశాల కలయికతో రూపొందుతున్న మరో ఆసక్తికరమైన ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. 'కె-ర్యాంప్' (K-Ramp) వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ 'సైరాబాను'. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణకాంత్ పరుచూరి సహ-నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. "A Fun Filled Journey of Love, Faith & Destiny' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో బాంధవి శ్రీధర్ కథానాయికగా నటిస్తున్నారు. ఒక హిందూ యువకుడు, ముస్లిం యువతి మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథను దర్శకుడు ఫణి కృష్ణ సిరికి ఇందులో అద్భుతంగా…
