జీ5లో ‘బ్యాండ్ మేళం’.. ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్
వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న టాప్ ఓటీటీ మాధ్యమం జీ5 త్వరలోనే మరో క్రేజీ మూవీతో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమైంది. ఆ సినిమాయే ‘బ్యాండ్ మేళం’. ఏప్రిల్ 24 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య కోన, శ్రావ్య కోన నిర్మించిన ఈ చిత్రానికి సతీష్ జవ్వాజి దర్శకుడు. కోర్ట్ చిత్రంతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్ల జంట ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ‘బ్యాండ్ మేళం’ సినిమాను అందమైన గ్రామీణ నేపథ్య చిత్రంగా రూపొందించారు. చిన్ననాటి నుంచి గిరి(హర్ష్ రోషన్), రాజి(శ్రీదేవి అపల్ల) స్నేహంతో కలిసి పెరుగుతారు. క్రమంగా వారి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. కొన్ని పరిస్థితుల్లో గిరి ఓ లోకల్…
