‘సోల్ ఆఫ్ లెనిన్’కి అద్భుతమైన స్పందన
మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెంచేశాయి. ఇటీవల మేకర్స్ ‘సోల్ ఆఫ్ లెనిన్’ అంటూ ఆడియెన్స్‌ని సర్ ప్రైజ్ చేశారు. ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. ‘పెద్ది’ ప్రదర్శనలకు ఈ ‘సోల్ ఆఫ్ లెనిన్’ను జోడించారు. ఈ ఉద్వేగభరితమైన, పవర్ ఫుల్ పాటకు బ్లాక్‌బస్టర్ స్పందన లభించింది. సినీ లవర్స్ ఈ పాట,…
