పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన వరుణ్ సందేశ్ “బ్లాక్ మెయిల్”
వరుణ్ సందేశ్, జెమిని సురేష్ ప్రధాన పాత్రలలో హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాతగా శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం బ్లాక్ మెయిల్. పూజా కార్యక్రమాలతో నేడు హైదరాబాద్ లోని ప్రసాద్ లో ఈ చిత్ర ప్రారంభం ఘనంగా జరిగింది. పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. జి ఎస్ చక్రవర్తి రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి ఎడిటర్ గా చేస్తుండగా, ఎస్ వి మల్లిక్ తేజ సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్ నిర్మాతల చేతుల మీదుగా దర్శకునికి అందించగా ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట గారు మొదటి క్లాప్…
