Skip to content

పద్మశ్రీ అందుకున్న నటుడు మురళీమోహన్, గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిసిన వేడుక

భారత ప్రభుత్వం నుండి తనకు పద్మశ్రీ పురస్కారం అందిన సందర్భంగా ప్రఖ్యాత నటులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివప్రతాప్ శుక్లా గారిని నేడు లోక్ భవన్ లో కలిసారు. శ్రీ మురళీమోహన్ గారిని గౌరవ గవర్నర్ గారు అభినందించి సత్కరించారు. చిత్రంలో కుటుంబ సభ్యులు శ్రీమతి రూపా మాగంటి, శ్రీ బి.యస్.రావు కూడా ఉన్నారు.

Read more

ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యగ్రంథంగా చేర్చాలి, టీడీ జనార్ధన్ ఓ అరుదైన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు – మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక రామారావు రాజకీయ నాయకుడిగా రాష్ట్ర దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, రాజకీయాల్లోకి యువత ను, బడుగులను ప్రోత్సహించి రాజకీయాలను మలుపు తిప్పిన మహనీయుడని, అటువంటి వ్యక్తి పేరిట నెలకొల్పిన అవార్డును నిజాయితీపరుడు, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు టిడి జనార్దన్ కు అందించడం సముచితమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసమయి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు హైదరాబాదులోని త్యాగరాజ గాన సభలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ…

Read more
ఏ.పి. ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ తొలి డైరెక్టర్ల సమావేశం Telugu News

ఏ.పి. ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ తొలి డైరెక్టర్ల సమావేశం

ఏ.పి. ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం తొలి బోర్డు సమావేశం సోమవారం విజయవాడ ఫార్చూన్ మురళి పార్క్ హోటల్‌లో విజయవంతంగా నిర్వహించామని మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్ తెలిపారు. సమావేశానికి కార్పొరేషన్ ఛైర్మన్ పి. భరత్ భూషణ్ అధ్యక్షత వహించగా, మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్, డైరెక్టర్లు వై. ఝాన్సీ, సుమన్ తల్వార్, ఎస్. శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయి మాధవ్, కందిమళ్ల సాంభశివరావు, వివేక్ కూచిభొట్ల, వి. సముద్ర, కే. ఉమామహేశ్వరరావు, ఎస్. వెంకట కృష్ణా రెడ్డి, జి. రాజ్ వెంకటేశ్వర…

Read more