Skip to content

‘ఆదర్శ కుటుంబం’ లో మా పాట వాడేయడం వల్ల నష్టపోతాం: నిర్మాత మంచి వెంకట్

▪️‘పర్ణశాల’ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాట ▪️ చిన్న సినిమాను బ‌తికించండి అంటూ ‘పర్ణశాల’ నిర్మాత ఆవేద‌న‌ ▪️ ‘ఆదర్శ కుటుంబం’లో 15 సెకన్ల పాట వినియోగంపై అభ్యంతరం ▪️ త్వరలో ప్రేక్షకుల ముందుకు ‘పర్ణశాల’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న ‘పర్ణశాల’ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఉపయోగించడంపై ‘పర్ణశాల’ నిర్మాత మంచి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హీరో వెంకటేష్‌కు సంబంధించిన ఓ సన్నివేశంలో తమ సినిమా పాటను వినియోగించారని, మా సినిమా రిలీజ్ కాకముందే ఇలా మా సినిమాలోని పాటను వాడటం చిన్న సినిమాకు అన్యాయం చేయడమే అని ఆయన పేర్కొన్నారు. చిన్న సినిమాను బ‌తికించండి అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ…

Read more

‘ఫీల్ గుడ్’ సినిమా నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల

సుచిత్, అదితి త్రిపాఠి జంటగా ప్రేమను ఆవిష్కరించే మధురమైన గీతం హైదరాబాద్‌: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా అవుతూ తెరకెక్కుతున్న రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘ఫీల్‌ గుడ్‌’ నుంచి ‘మమ్మా మియా’ పూర్తి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. విశ్వరూప ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై దయానంద్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో సుచిత్ నిర్మాణంలో సుచిత్‌, అదితి త్రిపాఠి జంటగా నటించిన ఈ పాట‌ ఆకట్టుకునే సంగీతం, మధురమైన గాత్రంతో ప్రేమలోని మాధుర్యాన్ని ఆవిష్కరిస్తోంది. యువతను ఆకట్టుకునే బాణీ, ఉత్సాహభరితమైన పదాలు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ‘వైబ్‌’, ‘సింక్‌’, ‘ట్రెండ్‌’, ‘హైప్‌’ వంటి పదాలతో సాగిపోయే ఈ పాటలో యూత్‌ఫుల్‌ ఎనర్జీ కనిపిస్తుంది. ల‌వ్‌లోని సరదా, స్నేహం, ధైర్యం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా పాటను రూపొందించారు…

Read more

డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్ తొలి చిత్రం ప్రారంభం

▪️దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు.. ▪️దర్శకుడిగా శశాంక్ దువ్వూరు పరిచయం.. ▪️రొమాన్స్ నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు ఆసక్తికర కథాంశం హైదరాబాద్‌: డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న తొలి చిత్రం ‘ప్రొడక్షన్ నంబర్‌ 1’ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్‌ దామోదర్‌ నేరేళ్ల తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శశాంక్‌ దువ్వూరు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి శివతేజ, భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, నేహా పఠాన్‌ కథానాయికగా కనిపించనున్నారు. స్నేహం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో పాటు సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలను మేళవిస్తూ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. డ్రీమ్ ప్రాజెక్టుగా సినిమా…

Read more

‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాట విడుదల

▪️ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల ▪️ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌.. సెలబ్రిటీలనూ ఆకట్టుకుంటున్న సాంగ్‌ హైదరాబాద్: టాలీవుడ్‌లో వినూత్న ప్రమోషన్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘పర్ణశాల’ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాట పూర్తి వెర్షన్‌ను సోమవారం ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా సినిమా విడుదలకు ముందు పాటలను ప్రమోషన్‌లో భాగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. అయితే ‘పర్ణశాల’ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాట విషయంలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి…

Read more

ఒక్క పాటతో సోషల్ మీడియాను షేక్ చేసిన ‘పర్ణశాల’ టీమ్

హైదరాబాద్: సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాలంటే భారీ ప్రమోషన్ బడ్జెట్.. స్టార్ హీరోలు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు.. వరుసగా రీల్స్, ఈవెంట్స్ అవసరమని భావించే రోజుల్లో ఓ చిన్న సినిమా టీమ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన దారిని ఎంచుకుంది. ఒక్క క్రియేటివ్ ఐడియాతో భారీ ప్రమోషన్ ఖర్చును తగ్గించడమే కాకుండా.. తమ సినిమాను జనాల్లోకి బలంగా తీసుకెళ్లింది. SLT ఫిలిమ్స్ బ్యానర్ నుంచి తెరకెక్కిన అదే ‘పర్ణశాల’ టీమ్ వేసిన మాస్టర్ ప్లాన్! హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాట ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం చేసిన ఓ వినూత్న ప్రయత్నం అనూహ్యమైన…

Read more

‘పోతిరెడ్డిపల్లి’ మూవీ ప్రారంభం

▪️మూవీ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాజ్య‌స‌భ‌ ఎంపీ ఆర్. కృష్ణయ్య, బాబుమోహ‌న్, త‌దిత‌రులు. ▪️ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్స‌వం హైదరాబాద్: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా, మౌనిక‌, సిరి హీరోయిన్లు నటిస్తున్న నూతన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పోతిరెడ్డిపల్లి’ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై జేరమ్ విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ రోయ్య దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 5న ఉదయం 9 గంటలకు నిర్వహించిన ఈ చిత్ర పూజా కార్యక్రమానికి అతిథులుగా మాజీ డిఫ్యూటీ సీఎం రాజయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్…

Read more

ఫిలిం ఫెడరేషన్‌పై భ‌గ్గుమ‌న్న సినీ సంఘాలు

▪️చిత్రపురి హౌసింగ్ సొసైటీలో భారీ అక్రమాల ఆరోపణలు ▪️ సినీ యూనియన్లను విచ్ఛిన్నం చేస్తున్నారంటూ విమర్శలు ▪️ వ‌ల్ల‌భ‌నేని అనిల్‌ను వ‌దిలిపెట్ట‌బోమంటూ తీవ్ర హెచ్చ‌రిక‌ ▪️ విచారణ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ ▪️ ఫిలిం ఛాంబర్‌కు బాధితులు, కార్మిక సంఘాల ప్రతినిధుల వినతిపత్రం ▪️ వల్లభనేని అనిల్‌ను జైలులో పెట్టాలి: పాశం యాద‌గిరి డిమాండ్ హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు వెన్నెముకగా భావించే 24 క్రాఫ్ట్స్ కార్మిక సంఘాల వ్యవస్థలో అంతర్గత పోరు ర‌చ్చ‌కెక్కింది. ఫిలిం ఫెడరేషన్‌లోని అధికార వ్యవహారశైలి, టాలీవుడ్ ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ (తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్) అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ అక్ర‌మాలు, యూనియన్లలో జోక్యం, ఎన్నికల ప్రక్రియ, కార్మికుల హక్కులు, చిత్రపురి హౌసింగ్ సొసైటీ వ్యవహారాలపై తీవ్ర…

Read more

‘సపర్య’ ప్రాజెక్ట్‌ను ప్రక‌టించిన కాదంబరి కిరణ్

▪️అనాథలు, ఒంటరి వృద్ధులు, పేదలకు అండగా ‘వుయ్ కేర్ ఫర్ అన్ కేర్డ్’ ▪️ పేద సినీ క‌ళాకారుల కోసం అనేక సేవ కార్యక్ర‌మాలు ▪️ సినీ కార్మికుల పిల్లలకు ఉచిత నీట్, ఐఐటీ శిక్షణ ▪️ 'మనంసైతం' సేవ‌ల‌కు 13 వ‌సంతాలు పూర్తి హైదరాబాద్: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం.. ఆర్థికంగా వెనుకబడిన వారికి భరోసా ఇవ్వడం.. ఒంటరిగా మిగిలిన వృద్ధులకు తోడుగా నిలవడం.. సేవను ఒక కార్యక్రమంగా కాకుండా బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సపర్య – వుయ్ కేర్ ఫర్ అన్ కేర్డ్’ పేరుతో నూతన ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు కాదంబరి కిరణ్…

Read more

కన్నడ స్టార్ విజయ్ రాఘవేంద్ర హీరోగా ‘ఆన్ డ్యూటీ’

హైదరాబాద్: క్రైమ్, యాక్షన్, థ్రిల్‌తో కూడిన విభిన్న కథలను తెరపై ఆవిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘పోలీస్ కంప్లైంట్’ మూవీతో హిట్ కొట్టిన‌ ఆయన.. ఇప్పుడు కన్నడలో తన అప్‌క‌మింగ్ మూవీ రూపొందించబోతున్నారు. 'ఆన్ డ్యూటీ' టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబానికి చెందిన ప్రముఖ హీరో విజయ్ రాఘవేంద్ర కథానాయకుడిగా నటించనున్నాడు. ఇప్పటికే క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ జానర్‌లో పలు విభిన్న చిత్రాల్లో నటించిన విజయ్ రాఘవేంద్ర.. సంజీవ్ మేగోటి చెప్పిన ఈ సరికొత్త కథకు ఓకే చెప్పడం…

Read more

ఘనంగా జరిగిన ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్

విద్యార్థులపై విద్యా ఒత్తిడి.. మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణే చిత్ర ప్రధానాంశం హైదరాబాద్: శ్రీ వాత్సల్య ఆడియో అండ్ వీడియో ఇల్లస్ట్రేషన్స్ పతాకంపై రూపొందిన తొలి చిత్రం ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ ప్రీవ్యూ హాల్‌లో ఘనంగా జరిగింది. చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు. స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర మాట్లాడుతూ.. గత 26 సంవత్సరాలుగా తిరువన్నామలైలో వైదిక ధర్మశాస్త్రాలను అధ్యయనం చేసిన తాను, నేటి యువతలో నైతిక విలువలు, మానవతా దృక్పథాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. ‘జై…

Read more