‘దొంగ నా కొడుకు’ నవంబర్ 13న రిలీజ్
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, 'లిటిల్ హార్ట్స్' చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ నటించిన 'దొంగ నా కొడుకు' చిత్రంతో వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. శ్రీను కంబళ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సరికొత్త, ఆసక్తికరమైన కథాంశంతో ఒక ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలోకి రానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమా కామెడీ టోన్ను ప్రజెంట్ చేస్తోంది. పోస్టర్లో మౌళి సోఫా మధ్యలో కూర్చొని షాక్, భయంతో కూడిన ఎక్స్ప్రెషన్తో కనిపిస్తున్నారు. ఆయన వెనుక తల్లిదండ్రుల పాత్రల్లో అలీ, రజిత కనిపిస్తున్నారు. రజిత సీరియస్గా మౌళి…
