‘డ్యూ డేట్’ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది!
లోమేష్ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్‌గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'డ్యూ డేట్' వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్ ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్ చుట్టు పూర్తి వాణిజ్య అంశాలతో…
