Skip to content

భారతీయ సినీ పరిశ్రమకు బల్గేరియా రెడ్ కార్పెట్!

▪️యూరప్‌లో కొత్త ప్రొడక్షన్ హబ్‌గా బల్గేరియా ▪️ భారతీయ చిత్ర నిర్మాతలకు సువ‌ర్ణ‌వ‌కాశం ▪️ 'ఆర్ఆర్ఆర్' బల్గేరియా నిర్మాత టోడర్ లాజరోవ్ జుజి ఆహ్వానం హైదరాబాద్: భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరించుకుంటున్న వేళ.. యూరప్‌లోని బల్గేరియా దేశం భారతీయ సినీ పరిశ్రమకు కొత్త ప్రొడక్షన్ హబ్‌గా అవతరించేందుకు సిద్ధమవుతోంది. తక్కువ నిర్మాణ వ్యయం, ఆకర్షణీయమైన ఆర్థిక ప్రోత్సాహకాలు, అత్యాధునిక చిత్రీకరణ సదుపాయాలు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు, విభిన్న సహజ-చారిత్రక లొకేషన్లతో బల్గేరియా భారతీయ చిత్ర నిర్మాతలను ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమానికి ముందుండి నాయకత్వం వహిస్తున్న టీఎల్ ప్రొడక్షన్ వ్యవస్థాపకుడు, 'ఆర్ఆర్ఆర్' సినిమా బల్గేరియా షెడ్యూల్ నిర్మాత, లైన్ ప్రొడ్యూసర్ టోడర్ లాజరోవ్ జుజి భారతీయ చిత్ర పరిశ్రమతో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని…

Read more