Skip to content

‘శరణాగతి’ కోసం చేతులు కలిపిన హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్

KGF’, ‘సలార్’, ‘కాంతార’ వంటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌తో పాటు, ‘మహావతార్ నరసింహ’ వంటి విభిన్నమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన హోంబలే ఫిల్మ్స్.. భారతీయ సినిమాకు కొత్త దారులు చూపిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా అత్యాధునిక AI మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న యానిమేషన్ చిత్రం ‘శరణాగతి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON) వ్యవస్థాపక ఆచార్యులు హిస్ డివైన్ గ్రేస్ ఏ.సి. భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల అసాధారణ జీవితం, ఆధ్యాత్మిక సేవా ప్రస్థానానికి ఘనమైన నివాళిగా ‘శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఎ సరెండర్డ్ సోల్’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ ప్రకటించాయి. అత్యాధునిక…

Read more